గున్నార్ మిర్థాల్
Gunnar Myrdal | |
---|---|
జననం | Gustafs, Dalarna, Sweden | 1898 డిసెంబరు 6
మరణం | 1987 మే 17 Danderyd, Sweden | (వయసు 88)
జాతీయత | Sweden |
రంగములు | Economics, Politics, Sociology |
వృత్తిసంస్థలు | Stockholm School of Economics, Stockholm University |
చదువుకున్న సంస్థలు | Stockholm University |
పరిశోధనా సలహాదారుడు(లు) | Gustav Cassel |
ప్రసిద్ధి | Monetary equilibrium |
ప్రభావితం చేసినవారు | Knut Wicksell John R. Commons[1] |
ముఖ్యమైన పురస్కారాలు | Nobel Memorial Prize in Economic Sciences (1974)[2] |
స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ డిసెంబర్ 6, 1898లో జన్మించాడు. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1930 ప్రాంతంలో తన భార్య ఆల్వా మిర్థాల్తో కలిసి సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల గురించి గ్రంథం రచించాడు. 1945లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు ఐక్యరాజ్య సమితి ఐరోపా ఆర్థిక కమీషన్కు ఛైర్మన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి, 1968లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో మిర్థాల్ ఆసియా దేశాలలోని పేదరికాన్ని వర్ణించాడు. 1960 నుంచి 1967 వరకు మిర్థాల్ స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అర్థశాస్త్రపు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1961లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో Institute for International Economic Studies ప్రారంభించాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1974 సంవత్సరంలో అతనికి ఫ్రెడరిక్ వాన్ హేయక్తో కలిసి సంయుక్తంగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మిర్థాల్ స్టాక్‌హోమ్ స్కూలను బాగా ప్రభావితం చేసాడు. ప్రాథమిక దశలో అతను చేసిన ఆలోచనలను తర్వాత జాన్ మేనార్డ్ కీన్స్ సిద్ధాంతీకరించాడు. ఇతను మే 17, 1987 న మరణించాడు. అతని యొక్క మరో ప్రముఖ గ్రంథం An American Dilemma: The Negro Problem and Modern Democracy.
మూలాలు
[మార్చు]- ↑ Walter A. Jackson, Gunnar Myrdal and America's Conscience: Social Engineering and Racial Liberalism, 1938–1987, UNC Press Books, 1994, p. 62.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;nobel
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
బయటి లింకులు
[మార్చు]- http://nobelprize.org/economics/laureates/1974/press.html Archived 2008-07-23 at the Wayback Machine
- Pioneering work in the theory of money and economic fluctuations and for their penetrating analysis of the interdependence of economic, social and institutional phenomena
- https://web.archive.org/web/20050316093427/http://www.africa2000.com/indx/myrdal.htm
- Gunnar Myrdal – Prize Lecture