Jump to content

గుదిబండ

వికీపీడియా నుండి
గుదిబండ
గుదిబండ

గుదిబండ దొంగపశువు మెడకు వ్రేలాడ గట్టు బరువుకొయ్య. ఆకతాయి పశువులను అదుపులో ఉంచడానికి దానిమెడలో బండను కడతారు. ఆ బరువుకు ఆ పశువు పరుగు పూర్తిగా ఆగిపోతుంది. ఆ బండా ముందుకు కదలదు. ఆ పశువునూ కదలనివ్వదు.[1] భారంగా పరిణమించినవాడిని 'గుదిబండ' అనీ వ్యవహరిస్తాం.

గుదిబండ దొంగపశువు మెడకు వ్రేలాడ గట్టు బరువుకొయ్య. ఆకతాయి పశువులను అదుపులో పెట్టడానికి దానిమెడలో బండను కడతారు. ఆ బరువుకు ఆ పశువు పరుగు పూర్తిగా ఆగిపోతుంది. ఆ బండా ముందుకు కదలదు. ఆ పశువునూ కదలనివ్వదు.

అల్లరి పిల్లలకు గుదిబండ

[మార్చు]

గుది బండ అనేది గుండ్రంగా కానీ, కోలగా గాని ఉండే బరువైన చెక్క బండ. దీనికి ఒక ఇనప గొలుసును అమర్చి, అల్లరి పిల్లల కాలికి కట్టేవారు. సామాన్యంగా, అల్లరి ఎక్కువ చేస్తూ, చెట్లెక్కి, ఇరుగు పొరుగు ఇళ్ళల్లోకి పరుగులు పెడుతూ నానా అల్లరి, చిన్న చిన్న దొంగతనాలు చేసే పిల్లలకు ఈ గుది బండ వేసేవాళ్ళు. ఈ గుది బండ వెయ్యటం వల్ల ఆ పిల్లలు కదలటం కష్టం అయ్యి, చదువు మీద దృష్టి పెడతారని ఈ శిక్ష ఉద్దేశము. అదే కాక, గుది బండ అందరూ చూస్తారు, గేలి చేస్తారు, ఆ పిల్లవాడికి చాలా సిగ్గు కలుగుతుంది. కనీసం దీని వాల్ల అయినా వాళ్ళ అల్లరి తగ్గించుకుంటారు అని సంస్కరణ దృష్టితో వేసే శిక్ష ఇది. ఈ గుది బండ శిక్షను పాత సినిమా దొంగ రాముడులో చూడవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "గుదిబండ శిష్యులు". www.teluguyogi.net. Retrieved 2018-03-13.
"https://te.wikipedia.org/w/index.php?title=గుదిబండ&oldid=2984854" నుండి వెలికితీశారు