అక్షాంశ రేఖాంశాలు: 15°32′17.520″N 79°50′41.676″E / 15.53820000°N 79.84491000°E / 15.53820000; 79.84491000

గుడిపూడివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుడిపూడివారిపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గుడిపూడివారిపాలెం
గ్రామం
పటం
గుడిపూడివారిపాలెం is located in Andhra Pradesh
గుడిపూడివారిపాలెం
గుడిపూడివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°32′17.520″N 79°50′41.676″E / 15.53820000°N 79.84491000°E / 15.53820000; 79.84491000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంచీమకుర్తి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523263

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామ రైతులకు, వరికోత యంత్రాలను రాయితీపై అందజేసినారు. ఈ యంత్రంతో ఒక ఎకరం వరిని రెండు గంటలలో, కేవలం 150 రూపాయల ఖర్చుతోనే, కోయవచ్చును. దీని వలన కూలీల ఖర్చు తగ్గుతుంది. డీజిలుతో పనిచేసే ఈ యంత్రంతో కోసిన వరిదుబ్బులు, ఒక రోజులోనే ఎండిపోవును. ఈ యంత్రంతో జొన్నచొప్పనూ మరియూ ఇతర గడ్డి జాతుల గడ్డిని గూడా కోయవచ్చును. [3]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామం, గోనుగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • 2013 జూలైలో గోనుగుంట గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కె.వెంకాయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా జి.వెంకటేశ్వర్లు ఎన్నికైనారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన చి. బుర్సు నరసింహం, గోనుగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాడు. ఇతడు తయారుచేసిన ప్రాజక్టు ఒకటి, జాతీయస్థాయిలో, దక్షిణభారత విభాగంలో ప్రథమ బహుమతి పొందినది. ఇతడు తయారు చేసినది, చెవిటివారు వినేలాగా "హియరింగ్ విత్ టీత్" (పంటితో వినడం) అను ప్రాజక్టు. ఇతడు, డిల్లీలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ చేతులమీదుగా ఈ బహుమతి అందుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు:- సంపతమ్మ + పెద్దన్న, బేల్దారు పనులు చేస్తుంటారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ప్రకాశం, 19 అక్టోబరు 2013. 7వ పేజీ.

వెలుపలి లంకెలు

[మార్చు]