గుండవరం
"గుండవరం" గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గుండవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామస్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°11′11″N 80°28′13″E / 16.1864631°N 80.4703486°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | చేబ్రోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 212. |
ఎస్.టి.డి కోడ్ | 08644. |
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామములోని విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామానికి సాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామ పరిధిలో ఒక ఎత్తిపోతల పథకం ఉంది. దీనిద్వారా కొత్తరెడ్డిపాలెం, నారాకోడూరు, గుండవరం గ్రామాలలోని 600 ఎకరాలకు సాగునీరు అందుచున్నది.
గ్రామ పంచాయతీ
[మార్చు]చిన్నంశెట్టి పోతురాజు, మాజీ సర్పంచ్.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దానబోయిన వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
ఈ గ్రామములో 15 లక్షల రూపాయాల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ కార్యాల భవనానికి 2017, ఆగస్టు-27న శంకుస్థాపన నిర్వహించారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శివాలయం
[మార్చు]శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయ 5వ వార్షికోత్సవం, 2015, మార్చి-16వ తేదీ సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు.
గ్రామ ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.