Jump to content

గుంటూరు మిరపకాయ

వికీపీడియా నుండి
గుంటూరు మిరపకాయ
జాతికాప్సికం చైనిస్
వృక్ష రకం'హాబనెరో'
కారం (హీట్) ఎక్కువ కారం
స్కోవిల్లె స్కేల్30,000-350,000 SHU
ఎండుమిర్చి కారం

గుంటూరు మిరపకాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా లో పండుస్తున్న మిరపకాయలు. ఈ మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా ఆసియా, కెనడా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గుంటూరు జిల్లా అనెక మిరపకాయలకు, మిరపకాయ పొడికి ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్పత్తులు శ్రీలంక, బంగ్లాదేశ్, మధ్యతూర్పు, దక్షిణ కొరియా, యు.కె, యుఎస్ & లాటిన్ అమెరికాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ మిరపకాయలు వివిధ రంగులు, వివిధ రకాల రుచులను దానిలో ఉన్నా కాప్సికం పరిమానాన్ని బట్టి కలిగి పుంటాయి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల వంటలలో ఈ గుంటూరు మిరప కాయలను ఉపయోగిస్తారు.

గుంటూరు మిరప వ్యవసాయదారులు

[మార్చు]
  • వండర్ హాట్ చిల్లీ అనునది అతికారంగా ఉన్న మిరపకాయ.
  • 334 చిల్లీ అనునది ఎగుమతి చేయవలసిన రకం.[1]
  • తేజా చిల్లీ[2] అనునది చక్కని గుంటూరు మిరపకాయ. [3]
  • గుంటూరు సన్న మిరపకాయ - S4 రకం అనునది ప్రఖ్యాతి చెందిన మిరప రకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన డిమాండ్ ఉన్నది. దీనిని గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పండిస్తారు. ఈ మిరపకాయ తొక్క దళసరిగానూ, ఎరుపుగానూ, కారంగానూ ఉంటుంది. ఈ పంట పండించే కాలం డిసెంబరు నుండి మే నలవరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పంట సుమారు 280,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీని అస్తా రంగు విలువ 32.11, కాప్సైచిన్ విలువ 0.226% ఉంటుంది.
  • 273 చిల్లీ అనునది సాధారణ ముడుతలు గల చిల్లీ.

ఇతర గుంటూరు మిరపకాయలలో పత్కి, ఇండో-5, అంకుర్, రోష్ని, బెడ్కి, మధుబాల కూడా ఉన్నాయి. పత్కి, తేజ రకాలను రుచి కొరకు, వంటల రంగుల కొరకు వాడుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Fresh crop seen boosting Guntur chili mandi volumes
  2. Fresh arrivals fail to pull down chili prices
  3. "Finer grade of Teja variety fetches Rs. 9,700 per quintal". Archived from the original on 2012-11-05. Retrieved 2016-01-24.