గిర్ అభయారణ్యం
గిర్ అభయారణ్యం | |
---|---|
Location Map | |
ప్రదేశం | గుజరాత్, భారతదేశం |
సమీప నగరం | జునాగఢ్ |
భౌగోళికాంశాలు | 21°08′08″N 70°47′48″E / 21.13556°N 70.79667°E |
విస్తీర్ణం | 1,412 km² |
స్థాపితం | 1965 |
సందర్శకులు | 60,000 (in 2004) |
పాలకమండలి | Forest Department of Gujarat |
గిర్ అభయారణ్యం, గిర్ జాతీయవనం (गिर वन) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది 1965 సంవత్సరంలో సుమారు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థాపించబడింది. ఇది జునాగఢ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గిర్ అభయారణయం ఆసియా ఖండంలోని ఏకైన ఆసియా సింహాలు (Asiatic Lions : (Panthera leo persica) నివసించే ప్రాంతం. భారత స్వాతంత్ర్యానికి ముందే జునాగఢ్ సంస్థానానికి చెందిన నవాబు ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాడు. అప్పటి నుండి ప్రభుత్వ, వివిధ స్వచ్ఛంద సంస్థల పర్యావరణ పరిరక్షణ చర్యల మూలంగా 15 మాత్రమే ఉండే ఈ ఆసియా సింహాలు 2005 సంవత్సరపు గణాంకాల ప్రకారం 359 కి చేరాయి.
వృక్ష జాతులు
[మార్చు]గిర్ అభయారణ్యంలో 1955 సంవత్సరంలో సర్వే జరిపి 400 పైగా వృక్ష జాతులున్నట్లు గుర్తించారు. బరోడా విశ్వవిద్యాలయం వారి సర్వేలో ఈ సంఖ్య 507 గా నిర్ధారించారు. ఈ అరణ్యం డై డెసిడుయస్, టేకు అరణ్యంగా వర్గీకరించారు. నిజానికి ఇది పశ్చిమ భారతదేశంలోని అతి పెద్ద డై డెసిడుయస్ అరణ్యం. ఇక్కడి తూర్పు ప్రాంతంలో సగానికి పైగా భాగంలో టేకు వృక్షాలున్నాయి.
జల వనరులు
[మార్చు]గిర్ అభయారణ్యం గుండా ఏడు నదులు ప్రవహిస్తున్నాయి: హిరన్, శత్రుంజీ, దటర్డి, శింగోడా, మఛుంద్రి, ఘొడావరి, రావల్. వీనిలో హిరన్, మఛుంద్రి, రావల్, శింగోడా నదులపై ఆనకట్టలు నిర్మించి నాలుగు జలాశయాలు ఏర్పడి వన్యప్రాణుల జీవనాధారమైనవి. వీటి ద్వారా మండు వేసవిలో కూడా వీటిని 300 పాయింట్ల నీరు లభిస్తుంది.
చిత్రాలు
[మార్చు]Photographs of Gir National Forest: