గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్
గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Gabriel José de la Concordia García Márquez 1927 మార్చి 6 అరకటక, కొలంబియా |
మరణం | 2014 ఏప్రిల్ 17 మెక్సికో, మెక్సికో | (వయసు 87)
జాతీయత | కొలంబియన్ |
పూర్వవిద్యార్థి | కార్టాజినా విశ్వవిద్యాలయం |
రచనా రంగం | నవలలు, చిన్నకథలు |
సాహిత్య ఉద్యమం | లాటిన్ అమెరికా స్వరం, మార్మిక వాస్తవ వాదం |
గుర్తింపునిచ్చిన రచనలు | One Hundred Years of Solitude, The Autumn of the Patriarch, Love in the Time of Cholera |
ప్రభావం | డానియల్ డెఫో,[1] ఫ్రాంజ్ కాఫ్కా,[2] James Joyce,[3] Virginia Woolf,[3] William Faulkner,[4] Ernest Hemingway[5] |
పురస్కారాలు | నోబెల్ బహుమతి 1982 |
జీవిత భాగస్వామి | మెర్చేడ్స్ బార్చా పర్దో |
సంతానం | రోడ్రిగో గార్సియా, గొంజాలొ |
సంతకం |
ప్రపంచ సాహిత్యానికి విలువ కట్టలేని రచనలెన్నింటినో బహూకరించడంతోపాటు 'మార్మిక వాస్తవ వాదం' పేరిట ప్రభావవంతమైన సిద్ధాంతాన్నీ అందించిన సుప్రసిద్ధ కొలంబియన్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్కెజ్. కటువుగా ఉండే విషయాన్నయినా ప్రేమగా చెప్పాలంటారు. ఈ సూత్రం బాగా తెలిసినవాడు మార్కెజ్. వర్తమానంలోని చేదు వాస్తవాలకు 'జానపద' మార్మికతను మిళితం చేసి. ఆ మిశ్రమ రసాయనం నుంచి 'మార్మిక వాస్తవ వాదం' అనే శిల్ప సిద్ధాంతాన్ని తయారుచేశారు. హాస్యం ప్రధాన రసంగా. కుటుంబ సంబంధాలు వాహికగా నియంతలపై ఆగ్రహం అంతస్సూత్రంగా సాగే ఈ సాహిత్య ధోరణి. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఏలుతున్నది. ‘పారిస్ రివ్యూ’లో మార్క్వెజ్ ఇంటర్వ్యూ లో ‘ఫ్రాంజ్ కాఫ్కా’ ఆయన inspiration అంటాడు. జేమ్స్ జాయిస్, బోర్జస్, హెమింగ్వే కూడా తనని Influence చేశారని చెబుతారు. తన రచనలతో చార్లెస్ డికెన్స్, లియో టాల్‌స్టాయ్, హెమ్మింగ్ వే, మార్క్ ట్వెయిన్ వంటి ప్రముఖ రచయితల సరసన చోటు సంపాదించుకున్న గాబ్రియెల్ అటు విమర్శకుల, ఇటు సామాన్య పాఠకుల మన్నన పొందారు.
బాల్యం
[మార్చు]కొలంబియాలో 1927 మార్చి ఆరో తేదీన గాబ్రియల్ ఎలిగియో గార్సియా, లూయిసా సాంటియాగా మార్క్వెజ్ లకు మార్కెజ్ జన్మించారు. ఆయన బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల వద్దే గడిచిపోయింది. "అనగనగా ఒక రాజు.... " కాకులు దూరని కారడవి..లాంటి శైలిలో సాగే మార్కెజ్ 'మార్మిక వాస్తవ వాద' రచనలకు వీరే ప్రేరణ.
చదువు
[మార్చు]నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో న్యాయవాద వృత్తి అభ్యసిస్తూనే జర్నలిస్టుగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]అమ్మమ్మ వాళ్లు ఉండే ప్రాంతం స్పెయిన్ వలస ప్రజలు, నల్ల బానిసలు, మూల వాసులతో నిండి ఉండేది. ఈ వైవిధ్య సాంస్కృతిక వాతావరణమే మార్కెజ్‌ను రచయితగా మలచింది. మార్కెజ్ పుట్టి, పెరిగి యవ్వనుడై రచనలు ప్రారంభించే సమయం దాకా కొలంబియాలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వమే సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. పుట్టిన గడ్డ కొలంబియాపై ధిక్కారం ప్రకటించిన మార్కెజ్ చివరివరకు అదే మొండితనం ప్రదర్శించారు. సంక్షుభిత లాటిన్ అమెరికాలో సాహిత్యం గురించి రాయడం కాదు.. మాట్లాడటమే నిషేధ వ్యవహారం అయిపోయిన దశలో 'లాటిన్ సాహిత్యాని'కి మార్కెజ్ సారథ్యం వహించారు. తోటి రచయితలు గంభీరస్వరంతో పలికే 'గాడ్‌ఫాదర్' అనే పదాన్ని సార్థకం చేసుకున్నారు. "వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్తో (శతాబ్ద కాలపు నిర్జన ప్రదేశం) అనే నవలతో ప్రపంచ సాహిత్య జగత్తు కూడా ఆయనకు జేజేలు పలికింది. నోబెల్ సాహిత్య బహుమతిని సంపాదించిపెట్టిన ఈ పుస్తకం 35 భాషల్లో అనువాదమయి, 3 కోట్ల మంది పాఠకుల పారాయణ గ్రంథంగా మారింది. మార్కెజ్ చాలా కాలం పాటు పాత్రికేయునిగా పనిచేశారు. స్నేహానికి ఆయన ప్రాణం ఇచ్చేవారు. క్యూబా కమ్యూనిస్టు నేత ఫిడెల్ కాస్ట్రోకు మార్కెజ్ మంచి మిత్రుడు. స్నేహితులను మెప్పించడం కోసమే మార్కెజ్ కలానికి పని చెబుతాడని సన్నిహితులు చలోక్తులు విసిరేవారు.
తన సాహిత్యమంతా ‘beautiful labyrinth of human experience’ చెప్పుకుంటాడు ఆయన. నా రచనల్లోని మిరాకిల్స్ అన్నీ, నా ఇమాజినేషన్ నుంచే పుట్టాయి అంటాడు. కథలో, నవలలో, మన మరో జీవితం కదా; అవి కలల్లాగా మన జీవితాల్లోని సంక్లిష్టతని, వర్ణమిశ్రమాన్ని తెలియజేయాలి కదా; “Where races condemned to one hundred years of solitude, will have, at last and forever, a second opportunity on earth” అంటాడు మార్క్వెజ్, తన నోబుల్ బహుమతి స్వీకరణ ప్రసంగంలో.
‘one hundered years of solitude’ లోని, ఒక దృశం : జోస్ అర్కాడియో బోండియా, ‘మెకాండో’ సమాజపు నాయకుడు, తన సమూహాన్ని (ప్రపంచం తెలియని) ఆ అజ్ఞాత భూమి నుంచి మరో ప్రాంతానికి తరలించాలని, ప్రయత్నిస్తాడు. సమస్తం ధ్వంసం కాబోతుందని అతనికి తెలుసు. తన జాతిని కాపాడుకోవాలని; అయితే ఎవరూ అతనితో రారు. ఆఖరికి ఆయన కుటుంబం కూడా. అతని భార్య (ఉర్సుల) తో, ‘మరణం ఇంకా రాలేదు కదా, ఇదే సమయం. ఇదేం మన సొంత భూమి కాదు చనిపోయి భూస్థాపితం అయినాక ఇది మన భూమి అవుతుంది. ఇప్పటికి అపరిచిత భూమే’ అంటాడు. ‘ఇదంతా నా చావు కోసమే అయితే, మీ అందరి కోసం, నేను ఇక్కడే చచ్చిపోతాను’ అంటుంది ఉర్సుల.
భూములన్నీ అపరిచిత భూములౌతున్న సందర్భం, ‘మెకాండో’ లాంటి ఒక ప్రాంతంలా ప్రపంచమంతా మారుతున్న వేళ; మనందరం జోస్ అర్కాడియో బోండియా, వారసులం అయినవేళ, మార్క్వెజ్ భవిష్యత్ దర్శనాన్ని చేసిన రచయితగా, ఆయన రచనలు ఎపిక్‌లుగా మారటంలో ఆశ్చర్యం లేదు. అటు ఫిడెల్ కాస్ట్రో, ఇటుబిల్ క్లింటన్ ఇద్దరూ అతని అభిమానులే. బైబిల్ తరువాత తను ఇష్టపడే పుస్తకం మార్క్వెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కలరా’ అంటాడు ఒక అమెరికన్ రచయిత. మార్క్వెజ్ రాసింది కొత్త ప్రపంచమే కాదు, మనం జీవిస్తున్న ఇవాళ్టి ప్రపంచమే అంటాడుసాల్మన్ రష్దీ.
‘Living to tell the tale’ నుంచి ఒక జ్ఞాపకం : మార్క్వెజ్ తాతకో వర్క్ షాపు ఉండేది. వర్క్‌షాపు గోడలన్నిటినీ తెల్లరంగుతో అలంకరిస్తాడు ఆయన. తన మనుమడిలో ఆ తెలుపు వర్ణం, సరికొత్త స్వప్నాల్ని, అద్భుతమైన ఊహల్ని మొలకెత్తించాలని, ఆయన కోరిక. నానమ్మ Fortune Teller; సాధారణదృశ్యాల్ని, అసాధారణ అనుభవాలుగా మార్చటం ఎట్లాగో తెలియజేసేది. ‘చూడు, చూడు, తోటల్లోని మల్లెల పరిమళం, మనపై దాడిచేస్తున్నట్లుగా ఉంది కదూ; కనపడని ఆత్మల దాడి అట్లాగే ఉంటుంది’ అనేది.
మార్క్వెజ్ భాష ప్రత్యేకమైంది. తన కాలపు స్వప్నాల్నీ ఫాంటసీలను నిక్షిప్తం చేసుకున్న భాష అది. తట్టుకోలేని బీభత్సం, మరణం, వందలాది నియంతల ఉద్భవం, అంతర్యుద్ధాలు, వాటిని చెప్పడానికి తన భాషకు సర్రియల్ స్పర్శను జోడించాడు. మార్క్వెజ్. మామూలు వచనమే, హఠాత్తుగా వందలాది చిత్రాలుగా మారుతుంది. భాషకు ఐంద్ర జాలిక శక్తులు వస్తాయి. ఒక Poetic Process వస్తుంది. సమాజంలోని Obsessions, Distrubences నెరేటివ్‌లోకి ప్రవేశిస్తాయి. Dark humour, Fantasy కథా నిర్మాణంలోకి ప్రవేశిస్తాయి. మార్క్వెజ్ కథలు ఒక Evocation (సంరావించటం) లా అనిపిస్తాయి. పాఠకుడిలో ఒక Illusion లాంటిది నిర్మితమవుతుంది. వచనం, ఒక Visual imaginationను కలిగిస్తుంది.
అయితే ఈ చర్య బౌద్ధిక స్థాయిలో జరుగుతుంది. ఒకానొక ఉద్వేగాన్ని, నెరేటివ్‌లో ప్రవేశపెట్టే ప్రయత్నంలో, visual imagination, ఒక ‘సర్రియల్ ఎటాక్’లా మారిపోతుంది. విశాలమైన రెక్కలున్న మనిషి, మన పెరట్లో జారిపడతాడు. అతనితో మనం, మన పిల్లలు మామూలుగానే సంభాషిస్తుంటాము. అతనికొక దుఃఖం, కథ; పిల్లి లోపల నివశించే ఆడమనిషి కథ చెబుతాడు. చనిపోయిన పొరుగింటి పిల్ల శరీరం, శవపేటికలో, రోజురోజుకీ అట్లా పెరుగుతూనే ఉంటుంది. జర్నలిస్టుగా పనిచేసిన మార్క్వెజ్, తన కథా భాషలో ఫాల్కనర్, జాయిస్‌ల వచనాల్లో కనబడే రిధమ్‌ని, కాఫ్కా నుంచి మెటాఫోరికల్ స్పర్శను, బోర్జస్‌లా కలల్లాంటి ఇమేజిరీని, అన్నింటినీ కలగలపిన తనదైన భాషను సృష్టించుకున్నారు. ఆయన కథా భాష నిండా నిశ్శబ్ద మాంత్రికత ఉంటుంది.
లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా, ప్రేమ పైన గొప్ప వ్యాఖ్యానం. ప్రేమ గురించిన ఒక మెడిటేషన్. spiritual history of human sexuality అది. the autumn of patriarch ఒక epic, లాటిన్. అమెరికా రాజకీయ చరిత్ర ; తనకాలపు నియంతలందరి పోలికలతో ఒక పాత్రలా రూపొందిన నవల. మార్క్వెజ్, తన రచనల్లో కాలం, జ్ఞాపకం మానవుని కలలు, ఆశలు, వాటిని నిరూపించడానికి ప్రయత్నించారు. ఆయన రచనలు మనతో సంభాషిస్తాయి. అవి మనపై ‘mild sorcery’లా పనిచేస్తాయి. మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్రలోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imaginationను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charmను, magic చేసే prose కనిపెట్టాడు. త్రోసుకొచ్చే మరణపు రాత్రుల్ని ఆపివేసే, వెలుగుల కిరణాల, ఎగిరే పక్షుల రెక్కల, శక్తిని తన పాత్రలకు ఇచ్చిన కథా/ నవలా మాంత్రికుడు మార్క్వెజ్.
సాధారణ జివితంలోని రోజువారీ ఘటనలకు అసాధారణ రీతిలో కాల్పనిక రూపం జోడించడమే మేజిక్ రియలిజం. తన రచనల్లో మేజికల్ రియలిజం పద్ధతిని ప్రవేశపెట్టిన మార్క్వెజ్ ఆ ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచారు. ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్(వందేళ్ల ఏకాంతం-1967)’, ‘ఇన్ ఈవిల్ అవర్’ (1962), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ (1985) వంటి నవలలు, ‘లీఫ్ స్టార్మ్’ (1955), ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్’ (1961) వంటి నవలికలతో ఖ్యాతిని పొందారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]మార్క్వెజ్ కి మెర్చేడ్స్ తో 1958 లో వివాహమయింది. వారికి ఇద్దరు కుమారులు రోడ్రిగో గార్సియా, గొంజాలో.
బహుమతులు
[మార్చు]సాహిత్యరంగంలో కృషికి గుర్తింపుగా 1982లో నోబెల్ అందుకున్నారు.
మరణం
[మార్చు]అభిమానులు 'గాబో'గా పిలుచుకొనే గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ 87 ఏళ్ల వయసులో ఏప్రిల్ 17, 2014 న కేన్సర్‌తో మరణించారు. తన కలం పోట్లతో ఆరు దశాబ్దాల పాటు తియ్యని గాయాలు చేసి ఉన్నపళంగా లోకంపై విషాదం తెరదించి వెళ్లిపోయారు. చివరి క్షణాల్లో భార్య మెర్చేడ్స్, ఇద్దరు పిల్లలు పక్కనే ఉన్నారు. "ఓ గొప్ప కొలంబియన్ మృతికి విచారిస్తున్నాను' అని దేశాధ్యక్షుడు జాన్ మాన్సుల్ శాంతోస్ నివాళి అర్పించారు. మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. గొప్ప దార్శనికత గల రచయితను ప్రపంచం కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు. సాహితీ యోధుడిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే కొనియాడగా, లాటిన్ అమెరికా స్వరం. ఇప్పుడు ప్రపంచ స్వరంగా మారిందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు బరోసో నివాళి అర్పించారు.
మూలాలు
[మార్చు]- ↑ [1]"The Journal of the Plague Year by Daniel Defoe"
- ↑ [2]" At the university in Bogotá, I started making new friends and acquaintances, who introduced me to contemporary writers. One night a friend lent me a book of short stories by Franz Kafka. I went back to the pension where I was staying and began to read The Metamorphosis. The first line almost knocked me off the bed."
- ↑ 3.0 3.1 [3]"I had never read Joyce, so I started reading Ulysses. I read it in the only Spanish edition available. Since then, after having read Ulysses in English as well as a very good French translation, I can see that the original Spanish translation was very bad. But I did learn something that was to be very useful to me in my future writing—the technique of the interior monologue. I later found this in Virginia Woolf, and I like the way she uses it better than Joyce."
- ↑ [4]"I'm not sure whether I had already read Faulkner or not, but I know now that only a technique like Faulkner's could have enabled me to write down what I was seeing. The atmosphere, the decadence, the heat in the village were roughly the same as what I had felt in Faulkner. It was a banana-plantation region inhabited by a lot of Americans from the fruit companies which gave it the same sort of atmosphere I had found in the writers of the Deep South. Critics have spoken of the literary influence of Faulkner, but I see it as a coincidence: I had simply found material that had to be dealt with in the same way that Faulkner had treated similar material."
- ↑ [5]" My influence had been Faulkner; now it was Hemingway."