గాంధీ ఫెలోషిప్
స్థాపన | 2008 |
---|---|
వ్యవస్థాపకులు | ఆదిత్య నటరాజ్,మన్మోహన్ సింగ్ |
రకం | సమాజ సేవ, నాయకత్వపు విద్య |
ప్రధాన కార్యాలయాలు | బాఘడ్, రాజస్థాన్ |
కార్యస్థానం |
|
సేవా ప్రాంతాలు | భారత్ |
గాంధీ ఫెలోషిప్(ఆంగ్లం:Gandhi Fellowship) పిరమల్ ఫౌండేషన్ ఇంకా కైవల్య విద్య ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా నిర్వహించే రెండు సంవత్సరాల నిర్బంధ నాయకత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి భారతదేశ వ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర స్థాయి సంస్థలు పాల్గొంటున్నాయి.[1][2]
చరిత్ర
[మార్చు]ఈ ఫెలోషిప్ 2008 సంవత్సరం రాజస్థాన్ రాష్ట్రంలోని చురు, ఝున్ఝును జిల్లాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య నటరాజ్, మన్మోహన్ సింగ్ స్థాపకులు.[3]
లక్ష్యం
[మార్చు]"ఏ మార్పు కోసమైతే ప్రపంచం ఎదురుచూస్తూందో ఆ మార్పుకోసం అందరిలో ఒకడిగా ఎదురు చూడకు... నువ్వే ఆ మార్పుగా మారు..." అన్న గాంధీజీ సూత్రాలను ఈ ఫెలోషిప్ లో అనుసరిస్తారు. 2025 నాటికి భారతదేశంలో పది లక్షల విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడానికి ఈ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.[4]
ఫెలోషిప్లో నిర్వహించే కార్యక్రమాలు
[మార్చు]పాఠశాల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం (SLDP)
[మార్చు]పాఠశాల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం (School Leadership Development Program (SLDP)) అనేది 2008 లో ప్రారంభించిన ఒక పునాది కార్యక్రమం. పాఠశాలను సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాఠశాల కార్యాచరణాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి అలాగే ప్రధానోపాధ్యాయులలో వ్యక్తిగత, బోధనా, సంస్థాగత ఇంకా సామాజిక నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. SLDP విద్యా రంగంలో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది, ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లోని 1300+ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
డిటిపి ఫెలోషిప్
[మార్చు]డిటిపి(District Transformation Program (DTP)) ఫెలోషిప్ ప్రోగ్రామ్ విద్యా వ్యవస్థలో వివిధ స్థాయిలలో ఉన్న వ్యక్తుల నాయకత్వ సామర్థ్యాలను నిర్మించాలనే ఆలోచనతో 2016 లో ప్రారంభమైంది. 2018 లో, పిరమల్ ఫౌండేషన్ నీతి ఆయోగ్ సమన్వయంతో దేశవ్యాప్తంగా 25 ఆకాంక్ష జిల్లాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలలో మార్పులు తేవడానికి పనిచేసాయి. 2021 జూన్ నుండి నీతి ఆయోగ్ గుర్తించిన 112 ఆకాంక్ష జిల్లాలలో పిరమల్ ఫౌండేషన్ ఆకాంక్ష జిల్లాల సమన్వయం అనే కార్యక్రమంపై కృషి చేస్తుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Staff (2008-08-26). "Ajay Piramal Foundation to support 100 Rajasthan schools". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
- ↑ "The Gandhi fellowship 2012". Hindustan Times (in ఇంగ్లీష్). 2012-03-27. Retrieved 2021-05-08.
- ↑ "This foundation is achieving educational goals in rural areas". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-05-07.
- ↑ "This foundation is achieving educational goals in rural areas - Education Today News". 2021-05-29. Archived from the original on 2021-05-29. Retrieved 2021-05-29.
- ↑ Mishra, Lalatendu (2021-06-08). "Piramal Foundation, NITI Aayog unveil COVID home care drive". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-12.