Jump to content

గబ్బిలం (జాషువా రచన)

వికీపీడియా నుండి

గబ్బిలం కవి గుర్రం జాషువా పద్య రచన. ఇందులో జాషువా సామాన్య ప్రజానీకం అశుభంగా భావించే గబ్బిలాన్ని దళిత జనుల అందరి తరపున వారి భాధలను వివరించడానికి శివుడి దగ్గరకు దూతగా పంపిస్తాడు. ఈ గబ్బిలం తమిళనాడులోని తంజావూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలమీదుగా, ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను దాటుకుంటూ కాశీలో ఉన్న శివుడి దగ్గరకు వెళుతుంది.[1]

ఈ ఖండకావ్యంలో రెండు భాగాలున్నాయి. సంస్కృతంలో కాళిదాసు రచించిన మేఘదూతంలో ఒకే మేఘం భార్య తన భర్తకి విరహవేదనను తెలియజేస్తే ఈ కావ్యంలో ఒక అంటరానివాడు గబ్బిలం ద్వారా శివుడికి తన బాధలకు ఏకరువు పెట్టుకుంటాడు.[2] కాళిదాసు మేఘసందేశంలో కథానాయకుడు ఒక యక్షుడు. జాషువా గబ్బిలంలో నాయకుడు ఒక అంటరానివాడు. కాశీ విశ్వనాథునికి సందేశం చేరాలని గబ్బిలం ద్వారా పంపడమే ఇందులో కథాంశం. ఎందుకంటే అప్పటికి దళితులకు ఆలయంలో ప్రవేశం లేదు. గబ్బిలాలు మాత్రం గుడిలో ఉండేవి.[3]

కొన్ని పద్యాలు

[మార్చు]

చిక్కినకాసుచేఁ దనివిఁ జెందు నమాయకుడెల్ల కష్టముల్
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగట్టు బిడ్డడై

గుర్రం జాషువా ఆధునిక తెలుగు కవుల్లో స్వరూపంలో సంప్రదాయాన్ని స్వభావంలో ఆధునికతను నింపుకున్న భావుకుడు. ఆధునిక ఖండకావ్య రచనలో చేయి తిరిగిన కవి. గబ్బిలం పై డా, కంఠెవరపు వెంకట్రామయ్య గారి వ్యాఖ్యానం వికీసోర్స్లో ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. ఎం, నళిని. "JOSHUA'S HUMANISTIC GABBILAM(BAT) –AS THE MESSENGER OF THE UNTOUCHABLE" (PDF). joell.in. Archived from the original (PDF) on 2018-07-12.
  2. వేల్చేరు, నారాయణ రావు (2003). Hibiscuis on the lake. Wisconsin: UW Press. ISBN 978-0-299-17704-1.
  3. "జాషువా పద్యాలు విప్లవ ఖడ్గ జ్వాలలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
  4. "గబ్బిలం వ్యాఖ్యానం - కఠెవరపు వెంకట్రామయ్య - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-10-06.