గన్నేరువరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్నేరువరం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం గన్నేరువరం
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 129 km² (49.8 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 21,780
 - పురుషులు 10,974
 - స్త్రీలు 10,806
పిన్‌కోడ్ 505473

గన్నేరువరం మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండల పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి .అందులో రెండు నిర్జన గ్రామాలు[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం కొత్తగా ఏర్పడింది. [2]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండల కేంద్రం ఇదే జిల్లాలో, ఇదే డివిజనులో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. మండల కేంద్రం గన్నేరువరం

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 129 చ.కి.మీ. కాగా, జనాభా 21,780. జనాభాలో పురుషులు 10,974 కాగా, స్త్రీల సంఖ్య 10,806. మండలంలో 5,758 గృహాలున్నాయి.[4]

2016లో ఏర్పడిన మండలం

[మార్చు]

లోగడ గన్నేరువరం గ్రామం కరీనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని బెజ్జంకి (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా గన్నేరువరం  గ్రామాన్ని (1+11) పన్నెండు  గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా కరీంనగర్ జిల్లా, కరీనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గన్నేర్‌వరం
  2. పరువెల్ల
  3. ఖాశింపేట
  4. మాధాపూర్
  5. మైలారం
  6. జంగాపల్లి
  7. సంగెం
  8. గోపాలపూర్
  9. గునుకుల కొండాపూర్
  10. యస్వాడ

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]