Jump to content

గణపవరపు వేంకటకవి

వికీపీడియా నుండి

గణపవరపు వేంకటకవి తెలుగు కవి. అతను జీవించిన కాలం తెలియదు కానీ శతక కవుల చరిత్రము లో వంగూరు సుబ్బారావుగారు ఈ కవి 16వ శతాబ్దానికి చెందినట్లుగాను అప్పకవి, బాలసరస్వతి, అహోబలపండితుని సమకాలీకులని తెలియజేశారు.[1] ఈకవి నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; వసిష్ఠగోత్రుడు; అప్పయామాత్యపుత్రుడు. ఇతడు కృష్ణా మండలములోని కామెపల్లెసీమ నందలి గణపర గ్రామంలో నివసించేవాడు.

ఇతడు శ్రీప్రబంధరాజ వేంకటేశ్వరవిజయ విలాసము అను పేరుగల ప్రబంధమును రచించెను.[2] ఇది ఒకే ఆశ్వాసము గల గ్రంథమే అయినా ఇందలి పద్యములసంఖ్య మాత్రము నాలుగాశ్వాసముల గ్రంథములో సామాన్యముగా ఉండే దాని కంటే ఎక్కువగా ఉన్నది. ఇతడును తనకు వేంకటేశ్వరుడు స్వప్నమున సాక్షాత్కరించి తను గూర్చి పలికినట్లు చెప్పుకొన్నాడు. ఇతడు పల్నాటి సీమవా డగుటచేతనే స్వానుభవముచేత గాబోలు పలనాటి గొల్లలపాటజాతి ' యని యచ్చటి గొల్లల పాటను నిరసించియున్నాడు. ఇతడు గొప్ప యోధుడు అయినను అతని కాలం గూర్చి సరిగా తెలియదు.

మూలాలు

[మార్చు]
  1. వంగూరు సుబ్బారావు (1924). శతక కవుల చరిత్రము (in Telugu). మద్రాసు: ఆంధ్రపత్రిక ముద్రణాలయం. Retrieved 5 August 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. గణపవరపు వేంకటకవి (1977). శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము (in Telugu). హైదరాబాదు: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి. Retrieved 5 August 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)