Jump to content

గణపతిశాస్త్రి

వికీపీడియా నుండి

గణపతి శాస్త్రి (ఆంగ్లం: Ganapati Sastri) కొందరు భారతీయుల పేరు.

తమ్మర గణపతి శాస్త్రి..తంజావూర్ జిల్లా తిరుప్పంగూర్ లో పుట్టారు.ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు...

  • (తమ్మర గణపతి శాస్త్రి) స్వతంత్ర సమరయోధుడు తామ్రపత్ర పురస్కార గ్రహీత, నిజాం విమోచన ఉద్యమ కారుడు ...

తమ్మర గణపతి శాస్త్రి గారు.

    • తంజావూరు ఆవాస గ్రామం అయిన తిరుప్పన్గూర్ లో 1923 ఫిబ్రవరి 3 న త్యాగరాజన్, మంగళాంబా దంపతులకు ముగ్గురక్కలకు ముద్దుల తమ్ముడిగా జన్మించారు గణపతి శాస్త్రి గారు..
    • అప్పటి నైజాం విద్యాశాఖలో పాఠశాలల తనిఖీ అధికారిగా విధులు నిర్వర్తించిన "నందుల లక్ష్మీనరసింహ శాస్త్రి గారిది నల్లగొండ జిల్లా కోదాడు ఆవాస గ్రామం అయిన " తమ్మర బండ పాలెం"..

సంతానం కోసం శాస్త్రి గారు సతీ సమేతం గా దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేసిన సందర్భంగా తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించి న సందర్భం లో అప్పటికే ఆ ప్రాంతంలో జ్యోతిష శాస్త్రం లో పండితునిగా ఖ్యాతి గాంచిన"యజ్ఞ నారాయణన్" గారింటికి వెళ్ళడం జరిగింది .వారి సూచనల మేరకు తన భర్తకు సత్సంతాన ము కొరకు ద్వితీయ వివాహం చేయాలని సంకల్పించి .యాజ్ఞ నారాయణన్ గారి మనుమరాలిని ( త్యాగరాజన్ మంగలాంబ ల జ్యేష్ట పుత్రిక) ను వివాహానికి అంగీకరింప చేశారు ...

    • అలా తమిళనాడు నుండి రాజ్యలక్ష్మి అనే నవ వధువు నేటి తెలంగాణా లోని తమ్మరబండపాలెంకు కోడలిగా వచ్చారు ..
    • కొంత కాలానికి బిడ్డను వదిలి వుండలేక త్యాగరాజన్ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో తమ్మరబండపాలెం నకే వచ్చి స్థిర నివాసం ఏర్పరచకున్నారు.

.. వారిలో రెండవ కుమార్తెను కృష్ణా జిల్లా, కంచికచర్ల ఆవాస గ్రామం జుజ్జురు లో పేర్వెల లక్ష్మీనారాయణ గారికి, చిన్న కుమార్తెను ఖమ్మం జిల్లా నేటి బొనకల్ మండలానికి చెందిన కావూరి సత్యనారాయణ శాస్త్రి గారికి ఇచ్చి వివాహం చేశారు.

    • ముగ్గురు ఆక్కల తమ్ముడు అయిన గణపతి శాస్త్రి గారు తమ్మర బండ పాలెంలో ఉంటూ. భక్త కవి శేఖర శ్రీమాన్ నరహరి గోపాలాచార్య గారి సాంగత్యంతో సంస్కృత .తెలుగు భాషలను అధ్యయనం చేశారు
    • బహుముఖ ప్రతిభ కల విద్యాసంపన్న కుటుంబం లోపుట్టి పెరగడం మూలానా నాటి దేశ కాల వైపరిత్యాలు సులువుగా చిన్నతనం లోనే అవగతమై నాయి..
  • "బావగారి చొరవతో కోదాడులో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి .కోదాడ సమీప సంస్థానం అయిన మునగాల నడి గూడెం కోటలో పరిచయమైన కొమర్రాజు లక్ష్మణరావు.. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ల ప్రేరణ లతో స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశించారు.
  • "14 వ యేట 1937 లో నాగపూర్ వెళ్లారు గణపతి శాస్త్రిగారు.
  • "మునగాల పరగణ దివాన్ కొమర్రాజు లక్ష్మణరావు గారు విద్యార్జన చేసిన నాగపూర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్వాతంత్ర్య సమర యోధుల సభలో కాకతాళీయంగా పాల్గొనటం వలన స్వాతంత్ర్య పోరాట యజ్ఞంలో సమిధగా మారాలన్న దృఢ సంకల్పానికి కారణమైంది .
    • నేటి తెలంగాణా ప్రాంతం నైజాం ఏలుబడిలో, కోస్తా రాయలసీమ ప్రాంతాలు బ్రిటీష్ ఇండియా ప్రత్యక్ష పాలనతో కూడిన మదరాసు రాష్ట్రములో భాగముగా విడివిడిగా ఉండేవి.
    • నైజాం నిరంకుశ పాలనలో పత్రికా స్వేచ్ఛ పై ఆంక్షలు ఉండేవి. విద్యాలయాలు తక్కువ ఉండేవి..
    • మదరాసు ( నేటి చెన్నయ్) లో స్వాతంత్ర్య ఉద్యమ సమావేశాలు బాగా జరిగేవి.
    • చెన్నపట్నంలో బంధువుల దగ్గరికి వస్తూ..పోతూ..

నాగపూర్, మదరాసు, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి లలో జరిగిన ఎప్పటి కాంగ్రెస్ సంస్థ సత్యాగ్రహ సమావేశాలలో చురుకుగా పాల్గొన్నారు తమ్మర గణపతి శాస్త్రి ..

    • హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాహక్కల సాధన ఉద్యమం (1938) లో తొలిసారిగా రాజకీయ ఖైదీగా జైలు కెళ్ళారు గణపతి శాస్త్రి...
    • కలకత్తా బ్రిటీషు ఇండియాకు చాలా కాలము ప్రధాన స్థావరంగా ఉన్న పెద్ద నగరము, తెల్లవారి పరిపాలనా కార్యాలయాలు ఎక్కువగా ఇక్కడే ఉండేవి.
    • స్వాతంత్ర్య ఉద్యమ సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ సంస్థ పిలుపు మేరకు 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కలకత్తా లోని బ్రిటీష్ హై కమీషనర్ కార్యాలయ ముట్టడి కై దేశం నలుమూలల నుండి తరలి వెళ్ళిన వారిలో తెలుగు నేల నుండి వెళ్ళిన గణపతి శాస్త్రి...కలకత్తాలో అరెస్టు కాబడి 8 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి ఆపై హైదరాబాద్ కు తరలించబడ్డారు ..

కోదాడ నైజాం ప్రాంత సరిహద్దు..ఆంధ్ర ప్రాంతంలో తెల్లదొరల ప్రత్యేక పరిపాలనా కార్యాలయాలు, తాలూకా కచ్చేరీలు విరివిగా వుండేవి .కోదాడ నాడు కుగ్రామమే అయినా,, జాతీయ రహదారి ప్రక్కనే ఉండటం వలన నిజాం ప్రతినిధులతో పాటుగా .బ్రిటీష్ వారి పక్షాన ఒక ప్రతినిధి తరచుగా . నేటి ఇన్స్పెక్షన్ బంగళా, పాత పోస్ట్ ఆపీస్ గల ప్రాంతాలలో సమావేశమై ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో కూడిన వ్యక్తుల సమాచార సేకరణకై నిఘా పెట్టేవారు .. తమ్మరలో ప్రస్తుత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఒకప్పుడు ఉన్న చెట్టు పై మువన్నెల పతాకాన్ని ఎగురవేసి ..ఆ ఉత్తేజం తో...కోదాడ లోని నేటి గాంధీ పార్కుకు ఎదురుగా గల ( పాత పోస్ట్ ఆపీస్) పెద్ద మఱ్ఱి చెట్టు పై రాట్నం గుర్తు గల నాటి ప్రతిపాదిత జాతీయ జెండాను ఎగురవేసినందుకు ఖైదు చేయబడి హైదరాబాద్ కు తరలించ బడ్డారు... 1947–48 సంవత్సరాలలో భారత యూనియన్ లో నిజాం సంస్థానపు విలీనపు పోరాటంలో పాల్గొని వంద రూపాయల జరిమానా, 8 నెలల జైలు శిక్షను హైదరాబాద్ లో, .మరలా 1947 సెప్టెంబరు 28 న ఖైదు చేయబడి నల్గొండ, నిజామాబాద్ జైళ్లలో 2 నెలల పాటు కారాగార శిక్షను అనుభవించారు గణపతి శాస్త్రి గారు...

1972 లో భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోట వద్ద నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చేతుల మీదగా భారత ప్రభుత్వ స్వాతంత్ర్య సేనాని పురస్కారాన్ని, ...రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా..."తామ్ర పత్ర పురస్కారం తో సత్కరించబడ్డారు గణపతి శాస్త్రి గారు..

    • " Whos who of freedom struggle in Andhra Pradesh"...రెండవ వాల్యూం "భారత ప్రభుత్వ ప్రచురణ ఆధారం గా....
    • తమ్మర గణపతి శాస్త్రి స్వాతంత్ర్యం అనంతరం కోదాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో

తొలి ఇ. ఓ గా...కోదాడ గ్రామ రెవెన్యూ శాఖలో పట్వారీగా పనిచేశారు .భార్య లక్ష్మీబాయి మరణించిన పిదప 2002 జనవరిలో స్వర్గస్తులైనారు .. తన 80 యేళ్ల జీవితంలో నాటి ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా ( నేటి పోరాటాల పేట సూర్యాపేట జిల్లా) కోదాడ ప్రాంతం నుండి ఎదిగి భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు సంపాదించినది ....రెవెన్యూ..., రాజకీయ రంగాలలో నిజాయితీ పరుడ నే పేరు మాత్రమే.... ఆరుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు గణపతి శాస్త్రి గారి సంతానం....