Jump to content

గండ్ర వెంకట రమణారెడ్డి

వికీపీడియా నుండి
గండ్ర వెంకట రమణారెడ్డి
గండ్ర వెంకట రమణారెడ్డి

గండ్ర వెంకట రమణారెడ్డి


పదవీ కాలం
  2009 - 2014, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965, మే 5
పరకాల, పరకాల మండలం, వరంగల్ గ్రామీణ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మోహన్ రెడ్డి - సుశీల
జీవిత భాగస్వామి  గండ్ర జ్యోతి
సంతానం ఇద్దరు కుమారులు

గండ్ర వెంకటరమణారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2] 2009 నుండి 2014 వరకు ప్రభుత్వ విప్ గా పనిచేశాడు.[3]

జననం, విద్య

[మార్చు]

వెంకటరమణారెడ్డి 1965, మే 5న మోహన్ రెడ్డి - సుశీల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, పరకాల మండలంలోని పరకాలలో జన్మించాడు. హైదరాబాదులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి 1987లో పాలిటెక్నిక్ ((లైసెన్స్ పొందిన సివిల్ ఇంజనీర్) పూర్తిచేశాడు.[4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వెంకటరమణారెడ్డికి జ్యోతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకటరమణారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పనిచేశాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి పై గెలుపొందాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారిపై 7,216 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి పై 15,635 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8] తరువాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[9]

వెంకట రమణారెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

హోదాలు

[మార్చు]
  1. 09.02.2012 - 19.05.2014, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Bhupalpalle Election Result 2018 Live Updates: Gandra Venkata Ramana Reddy of INC Wins". News18. 11 December 2018.
  3. "Andhra Pradesh Assembly session to last till December 20; Kiran Kumar Reddy calls on Governor". Deccan Chronicle. 12 December 2013.
  4. "Gandra Venkata Ramana Reddy | MLA | Bhupalpally | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-30. Retrieved 2021-09-17.
  5. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  6. "Gandra Venkata Ramana Reddy MLA of Bhupalpalle Andhra Pradesh contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-17.
  7. "Bhupalpalle Election Result 2018 Live Updates: Gandra Venkata Ramana Reddy of INC Wins". News18 (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2021-09-17.
  8. "Gandra Venkata Ramana Reddy(Indian National Congress(INC)):Constituency- BHUPALPALLE(JAYASHANKAR BHUPALPALLY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-17.
  9. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.