గంగా భవానీ
స్వరూపం
గంగా భవానీ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
---|---|
నిర్మాణ సంస్థ | ఛిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ |
భాష | తెలుగు |
గంగా భవానీ 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా చిల్డన్స్ ఫిలిం సొసైటీ నిర్మించిన ఈ బాలల చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు దర్శకునిగా పనిచేశాడు.
నాగార్జునసాగర్ సమీపంలోని ఒక వూరి గుడిలోంచి గంగాభవాని విగ్రహం మాయమవుతుంది. ముగ్గురు కుర్రవాళ్ళు అత్యంత ధైర్యసాహసాలతో ఘరానా దొంగలను పట్టుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. నాగార్జునకొండపైన వున్న మ్యూజియంలోని శిల్పసంపద గురించి, ఆంధ్రుల సంస్కృతి గురించి ఈ సినిమాలో చక్కగా తెలియజేశారు. మన ప్రాచీన కళాసంపదను కాపాడుకోవలసిన అవసరాన్ని ఈ సినిమా నొక్కిచెబుతుంది[1].
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: ఇరానీ
- నిర్మాణ సంస్థ: చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ
మూలాలు
[మార్చు]- ↑ వెంకట్రావ్ (14 January 1979). "చిత్రసమీక్ష - గంగాభవాని". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 280. Retrieved 8 December 2017.[permanent dead link]