Jump to content

గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 19°21′N 79°28′E / 19.35°N 79.47°E / 19.35; 79.47
వికీపీడియా నుండి
గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం గంగాపూర్ రెబ్బెన
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం గంగాపూర్ రెబ్బెన
గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం is located in Telangana
గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం
గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°21′N 79°28′E / 19.35°N 79.47°E / 19.35; 79.47
పేరు
ఇతర పేర్లు:బాలాజీ
ప్రధాన పేరు :శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గంగాపూర్ ,రెబ్బెన, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
దేవనాగరి :बालाजी मंदिर
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలం
ప్రదేశం:గంగాపూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వెంకటేశ్వరుడు
ప్రధాన దేవత:తిరుమల
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి,ఉగాది,దసరా
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:క్రీ. శ.13వ శతాబ్దం
సృష్టికర్త:కాకతీయులు

గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలంలోని గంగాపూర్, గ్రామంలో వాగు ఒడ్డున కొలువైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి.13వ శతాబ్దంలో నిర్మించ బడిన ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమిన స్వామి వారి జాతర వైభవంగా నిర్వహిస్తారు[1][2][3].

చరిత్ర

[మార్చు]

పూర్వం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో 13 వ శతాబ్దం కాలం నాటి అతి పురాతనమైన ఆలయం ఉంది . బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క[4] భక్తుడైన ముమ్మడి పోతాజీ ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానమును సందర్శించి ప్రార్థన చేసేవాడు. ఒక సంవత్సరం ముమ్మడి పోతాజీ అనారోగ్యం కారణంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన లేకపోయాడు. అప్పుడు స్వయంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడి కలాలో కన్పించి ఒక కొండ లోపల దాగి ఉన్న ఆ భక్తుడిని స్వయంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి వారు నన్ను గుర్తుంచు అని చెప్పడంతో ఆ భక్తుడు ఒక గునపం ఉపయోగించి ఆ రాతి కొండలో రంద్రం చేశాడు.ఆ తర్వాత స్వామి వారి విగ్రహాన్ని కనుగోని పూజలు నిర్వహించాడు.అప్పటి నుండి ప్రతి సంవత్సరం పవిత్రమైన మాఘ మాసంలో వచ్చే ప్రతి పౌర్ణమి నాడు అచట ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసేవాడు. ఆ తర్వాతి కాలంలో కాకతీయు‌ల రాజులు ఆ ఆలయాన్ని సందర్శించి అచట పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని పూజలు చేయడం ఆనవాయితీ.

విశేషం

[మార్చు]

బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం పర్వదినం సందర్భంగా ఆలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మూడు గడియాల పాటు కొలువుదీరి భక్తుల కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.అందుకే ఇచట భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు.

కల్యాణోత్సవం

[మార్చు]

గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం కంటే ఒక రోజు ముందు కల్యాణోత్సవం జరిపిస్తారు.ప్రతి సంవత్సరం మాఘ శుక్ల చతుర్దశి అనగా ఫిబ్రవరినెలలో అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామి వారి ఆలయం యందు కల్యాణోత్సవం జరిపిస్తారు. కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరుపుకుంటారు. స్వామి వారి కల్యాణాన్ని లక్ష మంది భక్తులు హాజరవుతారు. కల్యాణము ను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు అవుతారు.

రథోత్సవం

[మార్చు]
బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి రథం గంగాపూర్.

గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి.ఆలి వేలు మంగ , పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ అనంతరం రథోత్సవాన్ని నిర్వహిస్తారు.భక్తి పారవశ్యంతో భక్తులు స్వామి వారి రథాన్ని లాగడానికి పోటీ పడుతుంటారు. రథోత్సవాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా డీఎస్సీ అధ్వర్యంలో పోలిష్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ రథోత్సవం సందర్భంగా ప్రముఖులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ప్రముఖులను స్వాగతం పలకుతారు. దర్శనం ‌అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోసం రెబ్బెన మండల కేంద్రానికి చెందిన వర్తక వ్యాపారాలు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు[5].

జాతర

[మార్చు]
గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర.

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులోని గుట్ట పై ప్రకృతి ఒడిలో వెలసి సుందరమైన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ భక్తులకు కోర్కెలు తీర్చే దేవుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమి రోజును పురస్కరించుకుని ఆలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు.‌ఈ జాతరకు మంచిర్యాల జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామివారికి దర్శించుకుంటారు.ఇచట స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే అని భక్తులు భావిస్తారు[6][7][8][9].

రవాణా సౌకర్యాలు

[మార్చు]

గంగాపూర్ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక రవాణా సౌకర్యాలను ‌తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపో నుంచి పది నుంచి పదిహేను బస్సులు, కాగజ్‌నగర్‌ నుంచి ఎనిమిది నుంచి పది బస్సులు, బెల్లంపల్లి నుండి ఐదు నుండి ఎనిమిది బస్సులు ఆర్టీసీ అధికారులు భక్తులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా బస్సులు ఏర్పాట్లు చేస్తారు.

మూలాలు

[మార్చు]

మూలాలు==

  1. "Sri Balaji Venkateshwara Swamy Devasthanam - uniquelytelangana.in" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-09-20. Retrieved 2024-12-14.
  2. "Gangapur Temple | Kumuram Bheem Asifabad District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-14.
  3. Bharat, E. T. V. (2021-02-26). "గంగాపూర్ శ్రీ బాలాజీ ఆలయంలో ఉత్సవాలు". ETV Bharat News. Retrieved 2024-12-14.
  4. telugu, NT News (2024-02-24). "వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం". www.ntnews.com. Retrieved 2024-12-14.
  5. "గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ల స్వామి దర్శించుకున్న అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ సుగుణక్క - Akshara Vijetha" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-04-04. Retrieved 2024-12-14.
  6. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2025-01-07.
  7. telugu, NT News (2024-01-11). "గంగాపూర్‌ జాతరకు ఏర్పాట్లు చేయండి". www.ntnews.com. Retrieved 2024-12-14.
  8. Sumithra (2023-02-03). "రేపటి నుంచి మూడు రోజులపాటు గంగాపూర్ జాతర." www.dishadaily.com. Retrieved 2024-12-14.
  9. ABN (2023-02-03). "గంగాపూర్‌లో ప్రారంభమైన బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-14.