Jump to content

గంగాధర శాస్త్రి ఎల్.వి

వికీపీడియా నుండి
ఎల్. వి. గంగాధర శాస్త్రి
జననం
లక్కవఝల వెంకట గంగాధర శాస్త్రి

(1967-06-27) 1967 జూన్ 27 (వయసు 57)[1]
విద్యబి. ఏ
విద్యాసంస్థనాగార్జున విశ్వవిద్యాలయం
వృత్తిగాయకుడు, విలేఖరి, ప్రయోక్త, సంగీత దర్శకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భగవద్గీత ఫౌండేషన్
జీవిత భాగస్వామిఅర్చన
పిల్లలు
  • విశ్వతేజ
  • కీర్తి ప్రియ
తల్లిదండ్రులు
  • కాశీవిశ్వనాథ శర్మ (తండ్రి)
  • శ్రీలక్ష్మి (తల్లి)

లక్కా వేంకట గంగాధర శాస్త్రి ఒక ప్రముఖ గాయకులు , సంగీత దర్శకులు , విలేఖరి. భగవద్గీతను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చెయ్యడానికి భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు .[2] భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశారు.ఇందులో ఘంటసాల గానం చేసిన 106 శ్లోకాలను అదే రాగంలో పాడి మిగతా శ్లోకాలను స్వంతంగా స్వరపరిచారు .[3] ఘంటసాల పాటలు ఆయన గాత్ర ధర్మంతో ఆలపించడం ద్వారా అభినవ ఘంటసాల అనే పేరు పొందారు .

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

గంగాధర శాస్త్రి 1967, జూన్ 27 న కృష్ణా జిల్లా, అవనిగడ్డ లో కాశీవిశ్వనాథ శర్మ, శ్రీలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయనకు వేణుగోపాల్ అనే తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ వరకు స్వస్థలంలోనే చదువుకున్నాడు. నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల నుంచి బి.ఏ పూర్తి చేశాడు. తల్లిదండ్రులిద్దరికీ సంగీత పరిజ్ఞానం ఉండటంతో చిన్నప్పుడు వారి దగ్గర కొంత సంగీతం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఘంటసాలను అభిమానించేవాడు. ఆయన పాటలు స్ఫూర్తిగా తీసుకునేవాడు. ఆయన స్ఫూర్తితోనే హైదరాబాదులో శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఐదేళ్ళ పాటు సంగీతం నేర్చుకున్నాడు. కర్ణాటక సంగీతం శ్రీరంగం గోపాలరత్నం నుంచి నేర్చుకున్నాడు. డాక్టర్ కోవెల శాంత, వాసా పద్మనాభం, హరిప్రియ, రేవతి రత్నస్వామి దగ్గర కూడా సంగీతాన్ని అభ్యసించాడు.[1]

1995లో ఆయనకు అర్చనతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇరువురు సంతానం. కుమారుడు విశ్వతేజ. కుమార్తె కీర్తి ప్రియ.

విద్య

[మార్చు]
  • బిఎ, నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్
  • ప్రసార భారతి ఆల్ ఇండియా, దూరదర్శన్ లో ఎ గ్రేడ్ మ్యూజిక్ సింగర్
  • కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో శిక్షణ

అవార్డులు

[మార్చు]
  • పద్మశ్రీ గంటసాల గాన కళా సమితిచే లైఫ్ టైమ్ అచివ్మెంట్ అవార్డు కర్నూల్ - 2017
  • కళా రత్న (హంస) అవార్డు శ్రీ.ఎన్. చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది పండుగ-2017 సందర్భంగా ప్రదేశ్.
  • వందేమాతరం యూత్ ఫ్రంట్, హైదరాబాద్ వారిచే ఇండియన్ ఐడల్ అవార్డ్-2017
  • జిఎస్సార్ ఫౌండేషన్ గంటసాల స్వర కనకం-2016
  • ఉగాది పురస్కారం - 2016 , ఎఫ్ ఎ ఎస్ సొసైటీచే
  • యువకళావాహిని, కల్చరల్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ ద్వారా వివేకానంద సేవారత్న-2016 అవార్డు.
  • ఆధ్యాత్మిక సేవా రత్న అవార్డు-2013 కమలాకర లలితకళా భారతి, హైదరాబాద్.
  • అమృతవర్షిణి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ ద్వారా స్వర గంగాధర బిరుదు-2009
  • నారా చంద్రబాబు నాయుడుచే ఉగాది పురస్కారం
  • ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డు, అమ్మ మనసు సినిమా
  • కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు - 2023.[4]

వృత్తి

[మార్చు]

1990 నుంచి 2002 వరకు ఈనాడు, సితార పత్రికల్లో సినీ జర్నలిస్టుగా పనిచేశాడు. అంతే కాకుండా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. సినిమాల్లోనూ, రేడియోలోనూ, టీవీ సీరియళ్ళలోనూ, వేదికల మీద పాటలు పాడుతుంటాడు. సినిమాల్లో పాత్రలకు గాత్రదానం చేస్తుంటాడు. టీవీ కార్యక్రమాలకు, ప్రత్యేక కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించాడు. ప్రస్థుతం భగవగీతా ఫౌండేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

సినిమా పాటలు

[మార్చు]

1994లో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన నాన్నగారు అనే సినిమాలో పాటకు గాను ఉత్తమ నూతన గాయకుడిగా వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం సొసైటీ వారి నుంచి పురస్కారం అందుకున్నాడు. నేపథ్య గాయకుడిగా ఆయన తొలి సినిమా ఇది. అన్నమయ్య సినిమాలో కొన్ని పాటలు పాడాడు. శ్రీ మంజునాథ సినిమా లో ఓం అక్షరాయ నమః అనే పాటను గానం చేశాడు.

కార్యక్రమాలు

[మార్చు]
  • గండికోట ఉత్సవాల్లో భగవద్గీతా గాన పరిచయం
  • ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో నంది ఫిల్మ్ అవార్డ్స్
  • మధుర గీతాలు షో, సింగపూర్
  • స్వరకల్పనావదనం - 2005
  • స్వరాంజలి

పురస్కారాలు

[మార్చు]
  • 1994 లో నాన్నగారు సినిమాకు గాను ఉత్తమ నూతన గాయకుడిగా వంశీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సొసైటీ నుంచి పురస్కారం.
  • 1995 లో అమ్మమనసు టెలీ సీరియల్ కు గాను ఉత్తమ గాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం.
  • 1995 లో గీతా ఆర్ట్స్ థియేటర్, హైదరాబాదు వారిచే రాజీవ్ గాంధీ నేషనల్ ఇంటిగ్రేటెడ్ అవార్డు
  • 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[5][6]
  • 2023 కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు[7]

సంగీత దర్శకత్వం

[మార్చు]
  • భక్తకవి పోతన, తెలుగు సీరియల్
  • భారతీయ సంస్కృతి శిఖరాలు, తెలుగు సీరియల్
  • మహా గణపతి, తెలుగు సీరియల్
  • నటసామ్రాట్, తెలుగు సీరియల్
  • నాగబాల, తెలుగు సీరియల్
  • విశ్వంభర, తెలుగు సీరియల్
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రారంభ సంగీతం
  • తానా సిల్వర్ జూబ్లీ ప్రారంభ గీతం

అనేక కళాశాలల్లో వ్యక్తిత్వ వికాస శిబిరాలను కూడా నిర్వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Gangadhar Sastry Bhagavadgita". bhagavadgitafoundation.org. భగవద్గీత ఫౌండేషన్. Archived from the original on 12 December 2016. Retrieved 4 January 2017.
  2. "గాయకుడు గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు". indiaglitz.com. indiaglitz. Retrieved 12 December 2016.
  3. రెంటాల, జయదేవ. "గీతా గంగకు... అపర భగీరథుడు". sakshi.com. సాక్షి. Retrieved 9 December 2016.
  4. "Singer Gangadhara Sastry wins Sangeet Natak Academy award". Telugu Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-02-28. Retrieved 2024-02-29.
  5. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  6. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  7. Chitrajyothy (28 February 2024). "గంగాధర శాస్త్రికి ప్రతిష్ఠాత్మక 'కేంద్ర సంగీత నాటక అకాడమీ' అవార్డు | Gangadhara Sastri gets the prestigious National Sangeet Natak Akademi Award Kavi". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.