ఖైదీ రుద్రయ్య
స్వరూపం
ఖైదీ రుద్రయ్య (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ, శ్రీదేవి, రాధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఖైదీ రుద్రయ్య 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పరుచూరి సోదరులు కథ, చిత్రానువాదం అందించారు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాలో కృష్ణ శ్రీదేవి, శారద [1] రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది.
ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించారు. ఇది కోదండరామిరెడ్డి-కృష్ణ-శ్రీదేవి త్రయం చేసిన చివరి సినిమా. అయితే రెడ్డి, కృష్ణ సర్దార్ కృష్ణమ నాయుడులో చివరిసారి కలిసి పనిచేశారు.
తారాగణం
[మార్చు]- రుద్రమరాజు "రుద్రయ్య"గా కృష్ణ
- లతగా శ్రీదేవి
- యశోధర దేవిగా శారద
- ఫణిభూషణరావుగా రావు గోపాల రావు
- ఫణిభూషణ రావు పెద్ద కొడుకుగా కైకాల సత్యనారాయణ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- గిరిబాబు వెంకటగిరి "గిరి"
- అల్లు రామలింగయ్య
- కోటిగట్టుగా చలపతి రావు
- నూతన్ ప్రసాద్
- టెలిఫోన్ సత్యనారాయణ
- శ్రీధర్
- భీమరాజు
- భీమేశ్వరరావు
- అరుణ్ కుమార్
- పి.జె.శర్మ
- జగ్గు
- గాదిరాజు సుబ్బారావు
- చంద్రరాజు
- కె.కె.శర్మ
- చిడతల అప్పారావు
- ధమ్
- మిఠాయి చిట్టి
- సత్తిబాబు
- సిల్క్ స్మిత
- అనూరాధ
- వరలక్ష్మి
- శ్రీలక్ష్మి
పాటలు
[మార్చు]వేటూరి సుందరరామ మూర్తి రాసిన పాటలకు చక్రవర్తి బాణీలు కూర్చాడు.[2]
- అత్తాడి అత్తాడి - పి.సుశీల, రాజ్ సీతారాం
- మంజువాణి ఇంటిలో - పి. సుశీల, రాజ్ సీతారాం
- నీకు చక్కిలిగింతలు - పి.సుశీల, రాజ్ సీతారాం
- పూలెట్టి కొట్టమాకు - ఎస్.జానకి, రాజ్ సీతారాం
- రా గురూ - పి.సుశీల, రాజ్ సీతారాం
- శ్రుంగార వీధిలో - రాజ్ సీతారాం, పి. సుశీల