ఖైటోసాన్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Poliglusam; Deacetylchitin; Poly-(D)glucosamine
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [9012-76-4] |
SMILES | COC(=O)N[C@@H]1[C@H]([C@@H]([C@H](O[C@H]1O[C@@H]2[C@H](O[C@H]([C@@H]([C@H]2O)N)O[C@@H]3[C@H](O[C@H]([C@@H]([C@H]3O)N)O)CO)CO)CO)O[C@H]4[C@@H]([C@H]([C@@H]([C@H](O4)CO)O[C@H]5[C@@H]([C@H]([C@@H]([C@H](O5)CO)O[C@H]6[C@@H]([C@H]([C@@H]([C@H](O6)CO)O[C@H]7[C@@H]([C@H]([C@@H]([C@H](O7)CO)O[C@H]8[C@@H]([C@H]([C@@H]([C@H](O8)CO)O[C@H]9[C@@H]([C@H]([C@@H]([C@H](O9)CO)O)O)N)O)N)O)N)O)N)O)N)O)N)O |
సంబంధిత సమ్మేళనాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
ఖైటోసాన్ (ఆంగ్లం: Chitosan) ఒక సరళ పోలిసాకరైడ్. వందశాతం డిఎసిటైల్ చెయబడిన చిటిసన్ ను ఖైటోసాన్ అంటారు. చిటిసన్ సమృద్ధిగా రొయ్యలు, పీతలు,, ఇతర సముద్ర జలచరాలు పెంకులలో లభిస్తుంది. ఖైటోసాన్ ను చిటిసన్ తో సోడియం హైడ్రాక్సైడ్ చర్య ద్వారా తయారుచేస్తారు. ఖైటోసాన్ ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే బయోడిగ్రేడబుల్ పదార్థాలలో ఒకటి. ఖైటోసాన్ ను వాణిజ్య, బయోమెడికల్, వ్యసాయం, వైద్యంలో ఉపయోగిస్తారు.
తయారీ , లక్షణాలు
[మార్చు]ఖైటోసాన్ ను చిటోశాన్లను 100% డిఎసిటైల్ చేయడం ద్వారా తయారు చేస్తారు. వాణిజ్యపరంగా ఖైటోసాన్ ను రొయ్యలు, పీతలు,, ఇతర సముద్ర జలచరాల పెంకులలో ఉండే చిటిసన్ ను క్షార విశ్లేషణ చర్య ద్వారా ఉత్పత్తి చేస్తారు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన ఖైటోసాన్ అణు బరువు 3800 డాల్టన్, 60 నుండి 100% డిఎసిటైల్ సమూహాలను కలిగి ఉంటాయి. ఖైటోసాన్ లోనీ ఎసిటైల్, డిఎసిటైల్ సమూహాలను స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. 60 నుండి 100% డిఎసిటైల్ చేయబడిన చిటిసన్ ను ఖైటోసాన్ గా ఉపయోగిస్తారు. ఖైటోసాన్ అమినో సమూహాలను కలిగి ఉండడం వల్ల నీటిలో సాపేక్షంగా కరిగే స్వభావం కలిగి ఉంటాయి. నీటి లోఖైటోసాన్ pKa విలువ ~ 6.5, తటస్థంగా ఉంటుంది. ఆమ్లలలో ఖైటోసాన్ లోనీ అమినో సమూహాలు ప్రోటాన్ లను గ్రహించడం ద్వారా pKa విలువ 6.5 కంటే తక్కువగా ఉంటుంది.
ఖైటోసాన్ ఉపయోగాలు
[మార్చు]వ్యసాయంలో ఉపయోగాలు
[మార్చు]వ్యసాయంలో ఖైటోసాన్ ను ప్రధానంగా ఒక సహజ విత్తనశుద్ధి కారకంగా, మొక్కల పెరుగుదల పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. చిటోశాన్ మొక్కలలోని కిరణజన్య సంయోగం క్రియ ప్రోత్సహిస్తుంది, మొక్కల పెరుగుదల పెంచుతుంది, పోషక తీసుకునే ఉద్దీపన, అంకురోత్పత్తి పెంచుతుంది. పత్తి, మొక్కజొన్న, బంగాళాదుంపలు, సోయాబీన్స్, చక్కెర, టమోటాలు, గోధుమ, అనేక ఇతర విత్తనశుద్ధి లేదా విత్తనాలు పూతగా ఉపయోగిస్తారు. ఖైటోసాన్ విత్తనా నాణ్యతను మెరుగుపరచి కూరగాయలు, పండ్లు దిగుబడిని పెంచుతుంది. ఖైటోసాన్ మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి తమను తాము రక్షించుకునే అంతర్లీన సామర్ద్యము బాగా మెరుగుపరుస్తూది. వాణిజ్యపరంగా బయోడిగ్రేడబుల్ ఖైటోసాన్ ఉత్పత్తులను పెరిగిన మొక్కలు, పంటలపై ఉపయోగం అనుమతించబడింది.
బయోమెడికల్ ఉపయోగాలు
[మార్చు]ఖైటోసాన్ ఎర్ర రక్త కణముల యొక్క కణ త్వచం మధ్య ఫలకికలు వేగంగా అభివృద్ధి చేస్తుంది కనుక దీనిని తరచుగా హెమోస్టాటిక్ ఎజెంట్ గా ఉపయోగిస్తారు. ఖైటోసాన్ అణువులు తటస్థ ద్రావణంలో స్థిరమైన నిర్మాణం కలిగి ఉంటాయి, కానీ ఆమ్ల ద్రావణంలో కరిగిపోతుంది. ఖైటోసాన్ లోని ఈ తత్వాన్ని సాధ్యమైనంత వరకు శరీరములో మందులు రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు.
నీటి వడపోత
[మార్చు]ఖైటోసాన్ నీటి నుండి భాస్వరం, భారీ ఖనిజాలు, నూనెలు తొలగిస్తుంది, కనుక దీనిని నీటిని శుద్ధి చేయడానికి వాడుతున్నారు. ఖైటోసాన్ ను నీటిని వడపోత విధానంలో హానికర అవక్షేపణ రేణువులు తొలగించుటకు ఉపయోగించవచ్చు. నీటిని వడపోత విధానంలో ఖైటోసాన్ ను ఇసుక తొకలిపి వాడినప్పుడు 99% వరకు అవక్షేపలు తొలగిపోతాయి. అయితే, బురద ఇసుకను మాత్రమే వడపోతకు వాడినప్పుడు 50% వరకు అవక్షేపలు తొలగించవచ్చు. ఖైటోసాన్ పలు ఆహార, వైద్యపరమైన పరిశోధనలు చేయడానికి కూడా వాడుతున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Shahidi, Fereidoon; Synowiecki, Jozef (1991). "Isolation and characterization of nutrients and value-added products from snow crab (Chionoecetes opilio) and shrimp (Pandalus borealis) processing discards". Journal of Agricultural and Food Chemistry. 39 (8): 1527–32. doi:10.1021/jf00008a032.