ఖలీఫా బిన్ సల్మాన్
ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ( అరబ్బీ: خليفة بن سلمان آل خليفة ) ( 1935 నవంబరు 24 - 2020 నవంబరు 11) [1] బహ్రెయిన్ రాజకీయ నాయకుడు, అతను 1970 జనవరి 10 నుండి 2020లో మరణించే వరకు బహ్రెయిన్ ప్రధాన మంత్రిగా పనిచేశాడు. అతను 1971 ఆగస్టు 15న బహ్రెయిన్ స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందు బాధ్యతలు స్వీకరించాడు.[2] ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి.
బాల్యం
[మార్చు]
ప్రిన్స్ ఖలీఫా 1935 నవంబరు 24న జన్మించాడు.[3][4] అతను బహ్రెయిన్‌లోని మనామా హైస్కూల్, రిఫా ప్యాలెస్ స్కూల్‌లో చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతనికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రిన్స్ ఖలీఫా 1956 నుండి 1958 బహ్రయిన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.1958, 1961 మధ్య అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రిన్స్ ఖలీఫా1971లో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సంవత్సరాలు ఏకథాటిగా పరిపాలించారు. ప్రిన్స్ ఖలీఫా 2017 ఆగస్టు 6న వరల్డ్ పీస్ కల్చర్ అవార్డును అందుకున్నారు.
మరణం
[మార్చు]అల్ ఖలీఫా మిన్నెసోటాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్ హాస్పిటల్‌లో 2020 నవంబరు 11న 84 సంవత్సరాల వయస్సులో, తన 85వ పుట్టినరోజుకు 13 రోజుల ముందు మరణించాడు.[5] 50 సంవత్సరాల 11 నెలల పదవిలో కొనసాగిన ఆయన మరణించే సమయానికి చరిత్రలో ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Ministry of Foreign Affairs". Archived from the original on 9 November 2019. Retrieved 25 November 2019.
- ↑ [CIA World Factbook, 1999]
- ↑ "H.R.H. the Prime Minister". Kingdom of Bahrain Ministry of Foreign Affairs (in ఇంగ్లీష్). Archived from the original on 22 March 2017. Retrieved 21 March 2017.
- ↑ Hudhaifa Ebrahim (11 November 2020). "Bahraini PM Khalifa bin Salman Al Khalifa Dead at 84". The Media Line. Retrieved 13 November 2020.
- ↑ "Bahrain's longest serving prime minister, Prince Khalifa Al Khalifa, dies at 84". CNN. November 11, 2020.
- ↑ "Bahrain's long-serving PM Khalifa bin Salman Al Khalifa dies". Al Jazeera.
- ↑ "Khalifa bin Salman al Khalifa, leader of Bahrain's government, dies at 84". New York Times. 11 November 2020. Retrieved 16 January 2022.