ఖబ్రస్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాతార్లకు చెందిన ఒక ఖబ్రస్తాన్.

ఖబ్రస్తాన్ : ఖబ్ర్ (సమాధి, గోరీ - అరబ్బీ భాష), స్థాన్ (ప్రదేశం - పర్షియన్ భాష) వెరసి సమాధి ప్రదేశం, సమాధుల ప్రదేశం, శ్మశానం, శ్మశాన వాటిక. ముస్లింల శ్మశాన వాటికైతే ముస్లింల ఖబ్రస్తాన్, హిందువుల శ్మశాన వాటికైతే హిందువుల ఖబ్రస్తాన్.

ఖబ్రస్తాన్ కు అనేక పేర్ల రూపాలు; ఖబ్రస్తాన్, ఖబరస్తాన్, ఖబ్రిస్తాన్, కబ్రస్తాన్, కబరస్తాన్, కబ్రిస్తాన్ వగైరాలు.

ముస్లిం సాంప్రదాయం

[మార్చు]
జనాజా మోసుకెళ్తున్న ముస్లింలు. 1888 సం. నికి చెందిన ఒక పెయింటింగ్.

ఇతర అనేక మతాలలో లాగే ముస్లింలు కూడా మరణించిన వారి పార్థివ శరీరాన్ని భూమిలో ఖననం చేస్తారు. దీనినే దఫ్న్ లేదా దఫన్ అంటారు. ముస్లిం మరణిస్తే అతడి శరీరానికి "గుస్ల్" లేదా "గుసుల్" అనగా స్నానం చేయిస్తారు. తరువాత తెల్లటి బట్టను "కఫన్"ను శరీరానికి చుట్టుతారు. ఆ తరువాత జనాజా, (శవానికి మోసుకెళ్ళే పల్లకి) లో తీసుకెళ్ళి మస్జిద్లో గాని ఖబ్రస్తాన్ లో గాని "సలాతుల్ జనాజా" లేదా "నమాజె జనాజా" ఆచరించి సమాధిలో ఖననం చేస్తారు.

దస్త్రం:Muslim grave.jpg
ఒక ముస్లిం సమాధి.
ఖననం పూర్తయిన తరువాత సమాధి చిత్రం.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]