Jump to content

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్

వికీపీడియా నుండి

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు, నేర విచారణ పూర్తైన తర్వాత నేరబాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టులు సె-357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒక వేళ ఆవిధంగా అదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్లకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది. ముద్దాయిలపై ఉన్న కేసులను కొట్టివేసినప్పుడు, అట్లాగే వాళ్ళని విముక్తం చేసినప్పుడు కూడా కోర్టులు నష్టపరిహారం చెల్లించమని సిఫారసుచేసే అవకాశం ఉంది.కొన్ని సందర్భాలలో ముద్దాయి దొరకకపోవచ్చు. అతణ్ణి గుర్తించలేకపోవచ్చు. విచారణ జరగకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో నేరబాధితులుగాని వారిపై ఆధారపడిన వ్యక్తులుగానీ నేరుగా రాష్టన్య్రాయసేవాధికార సంస్థకుగాని లేదా జిల్లా న్యాయసేవా ఆధికార సంస్థకు గానీ నష్టపరిహారం కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. కోర్టునుంచి సిఫారసు అందినప్పుడు లేదా బాధితులనుంచి నేరుగా దరఖాస్తు అందినప్పుడు వాటి గురించి విచారణ జరిపి అవసరమైన నష్టపరిహారాన్ని నిర్ధారించి అవార్డు రూపంలో ఆ సంస్థలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ పనిని ఆ సంస్థలు విధిగా రెండు నెలల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. బాధితుల బాధను తగ్గించడానికి వారికి అవసరమైన ప్రథమ చికిత్సను, ఇతర వైద్యసదుపాయలను ఉచితంగా అందించడానికి న్యాయసేవాధికార సంస్థలు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది.

  • సె-372:కోర్టులు ముద్దాయిని విడుదల చేసినప్పుడు లేదా వారికి తక్కువ శిక్ష విధించినప్పుడు అట్లాగే బాధితులకు తక్కువ నష్టపరిహారం మంజూరు చేసినప్పుడు బాధితులు అప్పీలుచేసే అవకాశం ఉంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]