Jump to content

క్రికెట్‌లో బెట్టింగ్ వివాదాలు

వికీపీడియా నుండి

ఆటలోని బెట్టింగ్ అంశాలతో ఆటగాళ్లు పాలుపంచుకోవడంపై క్రికెట్ అనేక వివాదాలను ఎదుర్కొంది. ప్రత్యేకించి, అనేక మంది ఆటగాళ్లను బుక్‌మేకర్లు సంప్రదించడం, మ్యాచ్‌లు, మ్యాచ్‌లకు సంబంధించిన అంశాల (ఉదా. టాస్ వంటివి) గురించిన సమాచారం, లేదా ఇతర సమాచారం అందించడానికి లంచం ఇవ్వడం జరిగింది.

1999–2000 భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం

[మార్చు]

2000 లో ఢిల్లీ పోలీసులు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బుకీకి, దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ హన్సీ క్రోన్యేకి మధ్య జరిగిన సంభాషణను విన్నారు. అందులో మ్యాచ్‌లను ఓడిపోడానికి క్రోన్యే డబ్బు తీసుకున్నాడని తెలుసుకున్నారు.[1] [2] దక్షిణాఫ్రికా ప్రభుత్వం తమ ఆటగాళ్లలో ఎవరినీ భారత దర్యాప్తు విభాగం విచారించేందుకు అనుమతించలేదు. విచారణ కోర్టు ఏర్పాటు చేయబడింది. క్రోన్యే, తాను మ్యాచ్‌లను పణంగా పెట్టినట్లు అంగీకరించాడు. వెంటనే అతడిని అన్ని రకాల క్రికెట్ పోటీల నుంచి నిషేధించారు. అతను సలీమ్ మాలిక్ (పాకిస్తాన్), మహ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజా (ఇద్దరూ భారతదేశం) ల పేర్లు కూడా బయట పెట్టాడు. [3]

2018 శ్రీలంకలో క్రికెట్ పిచ్ ట్యాంపరింగ్ కుంభకోణం

[మార్చు]

2018 మే 26 న అల్ జజీరా వార్తా ఛానల్ పరిశోధనలో 2016 లో శ్రీలంకలో శ్రీలంక ఆస్ట్రేలియాతో ఆడినపుడు, 2017లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల సమయంలోనూ పిచ్ ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చని తెలిసింది. పిచ్ పరిస్థితులను పర్యవేక్షించడం ద్వారా ఫిక్సర్లు సులభంగా డబ్బు సంపాదించగలిగారని ఆ న్యూస్ ఛానెల్ పేర్కొంది. శ్రీలంక లోని గాలేలో మరోసారి పిచ్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించినందుకు గాను, మ్యాచ్ ఫిక్సర్లైన రాబిన్ మోరిస్ అనే మాజీ భారత దేశీయ క్రికెటరు, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ రాజ్‌కుమార్, గాలె గ్రౌండ్స్‌మెన్ తరంగ ఇండికా, శ్రీలంక ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ తరిందు మెండిస్‌లపై ఐసిసి, 2018 నవంబరులో శ్రీలంకతో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు విచారణ జరిపింది. [4] [5] గాలే క్రికెట్ స్టేడియంలో ప్లాన్ చేసిన ఈ పిచ్ ట్యాంపరింగ్‌ నేపథ్యంలో అసలు శ్రీలంకతో సిరీస్ ఆడాలా వద్దా అనే ఆందోళనలను కూడా ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు లేవనెత్తింది. [6] [7]

ఇతర వివాదాలు

[మార్చు]

1981 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టులో, ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు డెన్నిస్ లిల్లీ, రాడ్ మార్ష్ ఇంగ్లాండు గెలిచే అవకాశాలపై జరిగే బెట్టింగు 500–1 కి చేరుకున్న స్థితిల్ఫో ఇంగ్లాండు మ్యాచ్ గెలుస్తుందని పందెం వేశారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఫాలో-ఆన్‌ ఆడుతూ 135 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి, ఆస్ట్రేలియా గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న దశలో ఇది జరిగింది. అయితే, ఇయాన్ బోథమ్, బాబ్ విల్లీస్ ల అద్భుతమైన బ్యాటింగు ప్రదర్శనలతో ఇంగ్లండ్ ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. లిల్లీ, మార్ష్ లు £7,500 గెలుచుకున్నారు. తాము వేసిన పందెం గెలవడానికి ఆ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా తక్కువ పనితీరు కనబరిచారనే సూచన ఎప్పుడూ లేదు; అయినప్పటికీ, ఆ సమయంలో క్రికెట్ అధికారులు లిల్లీ, మార్ష్‌లను నిలదీయనందున, 1990లు, 2000లలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు ఇది దోహదపడిందని కొందరు సూచించారు.[8]

1994లో శ్రీలంక పర్యటనలో " జాన్ ది బుక్‌మేకర్ " నుండి మార్క్ వా, షేన్ వార్న్ లు డబ్బులు తీసుకున్నారనేది మరొక కుంభకోణం.[9] ఆటగాళ్ళు పిచ్, వాతావరణ సమాచారాన్ని ఇచ్చేందుకు బుక్‌మేకర్ నుండి $4,000, $5,000 తీసుకున్నారు. 1995లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న అప్పటి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆ ఇద్దరు ఆటగాళ్లకు జరిమానా విధించింది. అయినప్పటికీ, 1998 వరకు బోర్డు దీని గురించిన సమాచారం సాధారణ ప్రజలకు తెలియకుండా అడ్డుకుంది. ఈ కుంభకోణాన్ని వెంటనే ప్రకటించనందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది.[10] తరువాతి కాలంలో రాబ్ ఓ రెగాన్ QC ఇచ్చిన నివేదిక ప్రకారం, క్రికెటర్లు బుక్‌మేకర్‌లతో పరస్పర చర్య చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి క్రికెటర్లకు పూర్తిగా తెలియదని, వా లేదా వార్న్‌కు తదుపరి శిక్ష విధించబడనప్పటికీ, భవిష్యత్తులో ఆటగాళ్లకు జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా సస్పెన్షన్లు కూడా విధించాలని అన్నాడు.[11]

ICC నిదానంగా ప్రతిస్పందించింది. చివరికి 2000లో లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ మాజీ హెడ్ సర్ పాల్ కాండన్ నేతృత్వంలో అవినీతి నిరోధక, భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్‌లో అవినీతిని "తగ్గించదగిన కనిష్ట స్థాయికి" తగ్గించినట్లు పేర్కొంది.[12]

2010 పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ జరిపిన పర్యటనలో నాల్గవ టెస్టు సందర్భంగా, మజార్ మజీద్, మరికొంతమంది పాకిస్తానీ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో న్యూస్ ఆఫ్ ది వరల్డ్ ఒక కథనాన్ని ప్రచురించింది.[13] పాకిస్తాన్ ఆటగాళ్లు సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ లు ఆ తరువాత జైలు శిక్ష అనుభవించారు. వారిని క్రికెట్ నుండి నిషేధించారు.

2013లో, న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లను మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ICC సంప్రదించింది.[14] తర్వాత ఆ ముగ్గురూ లౌ విన్సెంట్, క్రిస్ కెయిర్న్స్, డారిల్ టఫీ అని చెప్పారు.[15] 2014లో విన్సెంట్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు.[16]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]
  • కునాల్ ఖేము, బోమన్ ఇరానీ, సోహా అలీ ఖాన్, సైరస్ బ్రోచా నటించిన 2009 హిందీ చిత్రం, 99, భారతదేశం-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని నేపథ్యంగా తీసుకుని 1999లో రూపొందించబడింది.
  • కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ, సోనాల్ చౌహాన్, జావేద్ షేక్ నటించిన 2008 హిందీ చిత్రం, జన్నత్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆధారంగా రూపొందించబడింది.
  • 2015 హిందీ చిత్రం క్యాలెండర్ గర్ల్స్ లో కొంత భాగం క్రికెట్‌పై బెట్టింగ్ ఆధారంగా రూపొందించబడింది.
  • 2016లో విడుదలైన హిందీ చలనచిత్రం అజార్, మొహమ్మద్ అజరుద్దీన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. అతని పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించాడు.
  • 2018 వెబ్ ఫిల్మ్ ఇన్‌సైడ్ ఎడ్జ్ దేశీయ లీగ్‌పై బెట్టింగ్ ఆధారంగా రూపొందించబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. It's Just Not Cricket
  2. Two more cricket bookies absconding after raids Archived 10 అక్టోబరు 2012 at the Wayback Machine
  3. "rediff.com: cricket channel - 'Mohammad Azharuddin fixed matches for bookie M K Gupta...'". www.rediff.com. Retrieved 2021-04-03.
  4. "Plot to fix England v Sri Lanka cricket test in Galle uncovered". Stuff (in ఇంగ్లీష్). Archived from the original on 2018-05-26. Retrieved 2018-05-26.
  5. "UK documentary alleges Sri Lankan groundstaff attempting to fix Test against England". TVNZ (in New Zealand English). Archived from the original on 26 మే 2018. Retrieved 26 May 2018.
  6. "Betacular Cricket - Online and Live Cricket Betting". 2023-01-24. Retrieved 2023-01-27.
  7. "Galle Stadium curator named in fixing scandal, admits to doctoring pitches to benefit bookmakers in sting operation- Firstcricket News, Firstpost". FirstCricket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 26 May 2018.
  8. Nasim, Col (Retd) Rafi (May 3, 2000). "New dimensions in match-fixing scam". ESPNcricinfo. Retrieved April 10, 2018.
  9. "Findings of the O'Regan Player Conduct Inquiry". 24 February 1999. Retrieved 9 November 2006.
  10. "Famous Cricket Spot-Fixing and Betting Scandals". 12 June 2013. Retrieved 22 June 2013.
  11. "ACB Player Conduct Inquiry Report". Archived from the original on 21 February 2007. Retrieved 9 November 2006.
  12. Interview by Andrew Miller (July 7, 2010). "Paul Condon on the ICC's Anti-Corruption Unit's role in preventing match-fixing: 'You'll never entirely eradicate fixing'". ESPNcricinfo. Retrieved April 10, 2018.
  13. "'Pak players were in touch with bookies during T20 WC'". Archived from the original on 31 August 2010.
  14. "3 NZ cricketers in fixing investigation". NZ Herald. AP. December 5, 2013. Retrieved April 10, 2018.
  15. Dylan Cleaver and Andrew Alderson (September 5, 2014). "Cricket: Tuffey still in the dark about betting investigation". NZ Herald. Retrieved April 10, 2018.
  16. "Full text of Lou Vincent's statement". ESPNcricinfo. ESPN Sports Media. July 1, 2014. Retrieved April 10, 2018.