Jump to content

కౌండిన్య మహర్షి

వికీపీడియా నుండి

కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది. కౌండిన్య గోత్రోద్భవులు ఇప్పుడు చెప్పబడుతున్న గౌడులు, వీరు నిజానికి వైదిక బ్రాహ్మణులు వీరికి ఉపనయన సంస్కారాలు ఉండేవి. ఇప్పటికి కూడా ఉత్తరభారతావనిలో గౌడ సారస్వత బ్రాహ్మణులుగా పిలువబడుతారు. వీరు చరిత్రలో గల కొన్ని అనివార్య కారణాల వలన వీరు దక్షిణాదికి వలస వెళ్లి వారి బ్రాహ్మణత్వాన్ని విడిచి కొందరు, విడువక కొందరు ద్రావిడ బ్రాహ్మణులుగా ఉన్నారు. బ్రాహ్మణత్వాన్ని విడిచిన వారు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల్లో ఈత తాటి కల్లు (సురాపానం) తీసే పనిలో ఉన్నారు. అది కూడా వారి చరిత్రే అని చెప్పాలి. క్షీర సాగర మథనంలో బయలు వెడలిన అమృతమే ఈ కల్లు (సురాపానం). ఇప్పుడు కొందరు ఉపనయనముల గావించి పౌరోహిత్యాన్ని ఆచరిస్తున్నారు.

భద్రాశ్వుడను మహర్షికి ఘృతాచి అనే అప్సరస ఘృతాచి, మొదటి భార్య ఆమెకి భద్ర, శూద్ర, మద్ర, శలభ, మలద, బలా, హల, గోచలప, తామరస, రత్నకూట అనే పదిమంది కుమార్తెలు, ప్రభాకరుడు అనే కుమారుడు జన్మించారు.యుక్త వయసుకి వచ్చిన తరువాత భద్రాశ్వుడు ఈ పదిమంది కన్యలను నవబ్రహ్మలలో మూడవ వాడైన అత్రిమహర్షికిచ్చి వివాహం చేశాడు.అత్రిభార్యలందరూ సుందరాంగులు, సద్గుణశొభితలు, పతివ్రతలై యున్నారు.పైవారిలో మద్ర అను ఆమెకి “చంద్రుడు” కుమారుడుగా పుట్టాడు.ఆ సుందరాంగుడు అయిన చంద్రుడ్ని చూచి రాహువు తనకి ఆహారము దొరికెను అనుకుని మ్రింగడానికి వచ్చింది.రాహువుని చూచిన మద్ర భయంతో వణుకుచు మూర్చపోయింది. ఇది చూచిన సూర్యుడు కూడా స్పృహతప్పి ఆకాశం నుండి భూమి మీదకి పడుచుండగా ప్రపంచమంతా గాఢాందకారం ఆవరించింది. ఇది చూచిన అత్రిమహర్షి తన శక్తితో క్రిందపడుచున్న సూర్యుని మధ్యలో ఆపుచు – “ఖర కిరణా ! నీకుశుభముగాక ! ” అనగానే ఆ ముని వాక్య శక్తికి క్రిందపడబోయే సూర్యుడు మునుపటి వలనే స్వస్తుడై, యథాస్థితిని పొంది, అత్రిముని పైన గౌరవం కలిగి అత్రిముని గోత్రబృందాన్ని ప్రసిద్ధులు అయ్యేట్లు చేయ సంకల్పించి ఆత్మగుణ భవ్యులైన ఆత్మ జన్ములను సృష్ఠించాడు.వారందరూ సర్వగుణ వర్ధిత కీర్తులు, బ్రహ్మవాదులు, ఉర్వీరమణ ప్రపూజితులు, వేదవిదులు, ఆర్యధర్మ సంభార సమగ్రులు, ఉత్తములు, భాసురతేజులు, యోగనిష్ఠాగరిష్ఠులైన వరిష్టులయ్యారు. ఈ భూమ్మీద బ్రహ్మ వంశోద్భవుడైన అత్రిమహర్షికి శాంతమూర్తి, యశశ్శరదిందు చంద్రికా పరివృత దిగ్వధూమకుట భవ్యతలుండు, అఖిలార్థవేది, సుందర తనురాజితుడు, కరుణానిధి, పుణ్య సముద్రుడైన శ్రీకౌండిన్యుడు ఉద్భవించిన క్రమము ఎట్టిదనిన – ఈశ్వరుడు త్రిపురాసుని సంహరించడానికి పూర్వం, రాక్షసులంతా లోక కంటకులై దేవాతలను ఏ విధంగా అయినా జయించి అమృత పానంతో అమరత్వాన్ని పొందాలన్న కోరికతో దేవలపై దండెత్తి వారిని హింసించడం వలన వారి ధాటికి తట్టుకోలేని ఇంద్రుడు భయపడి మునులందరితో కలసి హిమాలయాలలో చాలాకాలం వుండిపోవడం వలన దిక్పాలకులు తమ పనులను సక్రమంగా నిర్వహింప లేకపోవడం వలన భూలోకంలో వర్షాలు సమయానికి కురవక కరువు కాటకాలతో పంట పొలాలన్నీ బీడువారి నెఱలు వచ్చి మానవులంతా ఆకలితో అలమటిస్తూ ఆహాకారలు చేస్తున్నారు. అప్పుడు లోక కళ్యాణం ఆశించిన మహర్షులందరూ కలసి బ్రహ్మయైన అత్రిమహర్షిని దర్శించి భూలోక వాసులను రక్షించి ఆకలి బాధల నుండి నివారణ చేయుడని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన అత్రి మహర్షి దయార్ధ్ర హృదయుడై తన ఆత్మ తేజస్సుతో “ఓమ్ గౌడశ్యా శ్శివాయ స్వాహా” అనే దివ్య మంత్రోచ్చారణతో ఆయుధాన్ని ధరించిన ఒక దివ్య పురుషుణ్ణి ఉద్భవింపజేసి ఆ మానసపుత్రునకు “కౌండిన్యు” డని నామకరణం చేసి “కుమార ! నా తపః శక్తితో నీకు అనేక దివ్య శక్తులని అనుగ్రహించితిని భూలోకంలో వర్షాలు కురవకపోవడం వలన మానవులు ఆహార పానీయాలు లేక అల్లాడిపోతున్నారు. కనుక నీవు వెంటనే భూలోకంలోకి వెళ్ళి నీ దివ్య మహిమతో దేవలోక - భూలోక వాసులకు ఆహార పానీయలు కల్పించి రక్షించు” అని ఆజ్ఞాపించాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన కౌండిన్యుడు భూలోకానికి వచ్చి రోగాగ్రస్తులై పడి వున్న మానవుల రోగాల్ని పోగొట్టడానికి ఆరోగ్యాన్నిచ్చే అనేక దివ్య మూలికలని, నయనానందకరములైన అనేకానేక లతాపుష్పాదులను సృష్ఠించి, గౌడ మంత్ర ప్రభావంతో మధుర రసాలిచ్చే కల్ప వృక్షాలనబడే ఈత, తాడి, కొబ్బరి మొదలగు ఫల వృక్షాల్ని కల్పించి వాటి సాయంతోను, అలాగే ధాన్యాదులను సృష్ఠించి దేవలోక భూలోక వాసులకి ఆహారాలను సమకూర్చి రక్షించాడు. (మూలం...బ్రాహ్మణ మార్తాండము) సా.శ. 357 లో థాయిలాండులో ప్రాంతీయంగా వాడబడు సంస్కృత భాషలో శ్రీకౌండిన్య చరిత్ర వ్రాయబడింది.

బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, శివ పూజా దురంధరుదు, సత్యవాడి తపోధనుడైన సుమంతుడను వానికి “ప్రదేవ” అనే భార్యయందు “మాయాకన్య” అనె కుమార్తె పుట్టింది. ఆ కన్య క్రమంగా స్త్రీగా మారి పూర్ణ యౌవ్వనవతి కాగా సుమంతుడు వరుణి అన్వేషణ ప్రారంభించాలని అనుకున్నాడు. అంతలో కౌండిన్యుడు తన తండ్రి అయిన అత్రిమహర్షి ఆజ్ఞానుసారం వివాహం చేసుకోవడం కోసం సుమంతుని వద్దకు వచ్చాడు. సుమంతుడు తన దివ్య దృష్ఠితో కౌండిన్యుని వృత్తాంతం తెలుసుకుని మిక్కిలి సంతోషించి తన కన్యను చూపించి వివాహం ఆడుమని కోరాడు. సమాన రూప లావణ్య వయస్సుతో శోభిల్లుతున్న ఆ యువతీ యువకులు పరస్పరం దర్శించుకుని వివాహానికి అంగీకరించారు. అప్పుడు సుమంతుడు పరమానంద భరితుడై తన భందు వర్గాన్ని సువాసినులైన ముని పత్నులని రప్పించి మాయాకన్యని కౌండిన్యునికి ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. చిరకాలమా అన్యోన్య దంపతులు సంసార సుఖములు అనుభవించగా తేజోవంతులు, దివ్యజ్ఞాన సంపన్నులైన కౌండిల్య, ఆయుధర్ముడు, వామాక్షుడు, దేవాశ్రయుడను నలుగురు పుత్రులు జన్మించారు. వీరే కౌండిన్య గోత్రోద్భవులైన దేవగౌడలు.