కోళ్ల లలిత కుమారి
కోళ్ల లలిత కుమారి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
నియోజకవర్గం | శృంగవరపుకోట నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
నియోజకవర్గం | శృంగవరపుకోట నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 మార్చి 25 శృంగవరపుకోట, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జి. దేముడు | ||
జీవిత భాగస్వామి | పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) | ||
బంధువులు | కోళ్ల అప్పలనాయుడు (తాత)[1] | ||
సంతానం | ముగ్గురు కుమార్తెలు | ||
నివాసం | శృంగవరపుకోట |
కోళ్ల లలిత కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె శృంగవరపుకోట నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.
రాజకీయ జీవితం
[మార్చు]కోళ్ల లలిత కుమారి తన తాత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు స్పూర్తితో 2006లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి లక్కవరపుకోట మండలం ఖాసాపేట ఎంపీటీసీగా ఎన్నికై, మెజార్టీ ఎంపీటీసీల బలంతో ఎంపీపీగా ఎన్నికైంది. ఆమె 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అల్లు కేశవ వెంకట జోగినాయుడు పై 3,440 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2009 నుండి 11 వరకు విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసింది. కోళ్ల లలిత కుమారి 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాధం పై 28572 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]
కోళ్ల లలిత కుమారి 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా నియమితురాలైంది.[3] ఆమె 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై 11,365 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[4]
కోళ్ల లలిత కుమారి 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుపై 38790 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
మూలాలు
[మార్చు]- ↑ HMTV (29 June 2019). "తాతకు తగ్గ మనవరాలిగా లలిత ఎందుకు అనిపించుకోలేకపోయారు?". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (28 April 2015). "టీటీడీ బోర్డు సభ్యురాలిగా కోళ్ల లలిత". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
- ↑ Suryaa (29 June 2019). "కోట్ల కుటుంబానికి షాకిచ్చిన ఎస్ కోట ప్రజలు!". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.