Jump to content

కోల్లూరు

వికీపీడియా నుండి
కొల్లూరు
ಕೊಲ್ಲೂರು
కొల్లూరు
గ్రామం
శ్రీ కొల్లూరు మూకాంబికా దేవాలయం
శ్రీ కొల్లూరు మూకాంబికా దేవాలయం
దేశం India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉడిపి
తాలూకాకుందపూర్ తాలూకా
Elevation
568 మీ (1,864 అ.)
భాషలు
 • అధికారకన్నడ
Time zoneUTC+5:30 (IST)
PIN
576220
చరవాణి కోడ్08254
Vehicle registrationKA-20

కొల్లూరు లేదా కోల్లూర్ (కన్నడ:ಕೊಲ್ಲೂರು) కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపూర్ తాలూకాకు చెందిన పట్టణం. ఇది కుందాపురా తాలుకా నుంచి 40 కిలోమీటర్లు, శివమొగ్గ జిల్లా కేంద్రం నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న తల్లి మూకాంబికా అమ్మవారు. అమ్మను దర్శించు కోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇక్కడకి కేరళ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక్కడ మూకాంబికా అభయారణ్యం ఉంది. ప్రముఖంగా 5స్టార్ హోటల్స్, లాడ్జింగ్ బోర్డింగ్ ఉంది. ఇక్కడ ఎటువంటి రణగొణ ధ్వనులు, కాలుష్యం ఉండదు. అరణ్య వాతావరణాన్ని తలపిస్తుంది. అటవీ సౌందర్యం మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువుగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలు షూటింగ్‌లు జరుగుతాయి.

మూకాంబికా అమ్మవారు

[మార్చు]
కొల్లూరు మూకాంబిక దేవాలయం లోపలి దృశ్యం
1904లో శిష్యులతో ఆదిశంకర, రాజా రవివర్మ,

ఈ కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడం, దేవి ప్రత్యక్షమవ్వడం తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడగడం, దేవి కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట నడవడం కాని వెనక్కి తిరిగి చూడ వద్దని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పడం...ఆ షరతుకు అంగీకరిం చిన శంకరాచార్య ముందుకు నడుస్తూ.. . వెనుక అమ్మవారు వెళ్తూ వెళ్తూ కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో వెనుకకు తిరిగి చూడడం ఇచ్చిన మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరుల వారు శ్రీ చక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి.[1]

మూలాలు

[మార్చు]
  1. Suryanath Kamath Karnataka State Gazetteer (1983) vol. 2, http://gazetteer.kar.nic.in/ 10 September 2011

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోల్లూరు&oldid=3896858" నుండి వెలికితీశారు