Jump to content

కోరుట్ల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
కోరుట్ల రెవెన్యూ డివిజను
కోరుట్లలోని దేవాలయం
కోరుట్లలోని దేవాలయం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజగిత్యాల

కోరుట్ల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జగిత్యాల జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కోరుట్ల లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

కోరుట్ల డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం కోరుట్ల రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 కోరుట్ల మండలం 15 రెవెన్యూ గ్రామాలు
2 కథలాపూర్ మండలం 18 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
4 మేడిపల్లి మండలం 19 రెవెన్యూ గ్రామాలు
3 భీమారం మండలం 9 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-03.
  3. "Administrative Setup | Karimnagar | India". Archived from the original on 2021-11-06. Retrieved 2022-04-03.
  4. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-04-03.