కోయ నృత్యం
కోయలు పండుగలు, పెండ్లి ఉత్సవాల్లో ఎద్దుకొమ్ము నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పురుషులు ఎద్దు కొమ్ములను తలపై ధరించి రంగు రంగు దస్తులను ధరిస్తారు. ఈ నృత్యంలో సుమారుగా 30 నుంచి 40 మంది పాల్గొంటారు. ఈ నృత్యాన్ని ప్రధానంగా వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండే కోయలు ప్రదర్శిస్తారు. [1]
కొమ్ము కోయ నృత్యం
[మార్చు]గిరిజన తెగల్లో పురుడు పోసుకొన్న వివిధ జానపద రూపాలలో ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది. కోయ జాతివారు మాత్రమే చేసే కొమ్ము కోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. తలమీద ఎద్దు, అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం, దాని పైన నెమలి పింఛాలు ధరించి, మెడలో పెద్ద డోలు వేసుకొని ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. తొలకరి సమయంలో గిరిజనులు భూమి పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పంటలు బాగా పండాలని తమ దైవాన్ని పూజిస్తూ ఈ నాట్యం చేస్తారు. కొన్ని నృత్యాలు కేవలం దైవారాధనకే పరిమితం అవుతాయి. కానీ, కోయ నృత్యాలు వారి జీవితంలో భాగమైపోయాయి. కోయల పుట్టుక నుంచి మరణం వరకు జరిగే అనేకానేక కార్యక్రమాల్లో కొమ్ము కోయ నృత్యం తప్పనిసరిగా ఉంటుంది.
-
గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలోని కొమ్ముకోయ విగ్రహం
-
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వివిధ వాయిద్యాలతో కొమ్ముకోయ కళాకారులు
-
హైదరాబాద్కు చెందిన కొమ్ముకోయ కళాకారులు
-
హైదరాబాద్కు చెందిన కొమ్ముకోయ కళాకారులు
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ కోయ నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.
ఈ వ్యాసం కళలకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |