Jump to content

కోడలు దిద్దిన కాపురం (1970 సినిమా)

వికీపీడియా నుండి

కోడలు దిద్దిన కాపురం ,21, అక్టోబర్ ,1970 న విడుదలైన ఉత్తమ విలువలు ఉన్న చిత్రం.ఈ చిత్రాన్ని ఎన్ టి ఆర్ ఎస్టేట్స్ బ్యానర్ పై త్రివిక్రమ రావు నిర్మించిన, ఎన్టీఆర్ 200 వ చిత్రం.నందమూరి తారక రామారావు , సావిత్రి, జగ్గయ్య, వాణీశ్రీ , మున్నగు వారు నటించిన ఈ చిత్రాన్ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తమ నంది అవార్డుకు ఎంపిక చేయబడింది.ఈ చిత్రానికి దర్శకత్వం డీ.యోగానంద్ కాగా , సంగీతం టీ వీ రాజు అందించారు.

కోడలు దిద్దిన కాపురం
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం సావిత్రి,
ఎన్.టి.రామారావు,
జగ్గయ్య,
వాణిశ్రీ,
నాగభూషణం,
సూర్యకాంతం,
రేలంగి,
పద్మనాభం,
రమణారెడ్డి
సత్యనారాయణ,
త్యాగరాజు,
చిత్తూరు నాగయ్య(అతిథి పాత్ర)
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ ఎన్.టి.అర్. ఎస్టేట్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

సావిత్రి

వాణిశ్రీ

జగ్గయ్య

నాగభూషణం

సూర్యకాంతం

రేలంగి

పద్మనాభం

సత్యనారాయణ

రమణారెడ్డి

చిత్తూరు నాగయ్య

త్యాగరాజు .

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి 1970 వ సంవత్సరానికి గాను, రజిత నంది అవార్డు ప్రకటించింది.

పాటలు

[మార్చు]
  1. వంట ఇంటి ప్రభువులం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాఘవన్,రచన:కొసరాజు
  2. పునరపి జననం పునరపి మరణం, మాధవపెద్ది
  3. అమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడివి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: కొసరాజు
  4. అంతా తెలిసి వచ్చానే నీ అంతే చూసి పోతానే . ఘంటసాల, జానకి, ఎన్ టి రామారావు. రచన: సి. నారాయణ రెడ్డి.
  5. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద , మాధవపెద్ది, పిఠాపురం బృందం , రచన: కొసరాజు
  6. క్లబ్బంటే ఎందరికో భలే మోజు ఈ జబ్బులేనివాళ్ళు లేరు ఈ రోజు . ఘంటసాల, ఎన్ టి ఆర్. రచన కొసరాజు.
  7. చూడరనాన్నా లోకం ఇదేరనాన్నా మా లోకం . ఘంటసాల, ఎన్ టి ఆర్ . రచన: కొసరాజు
  8. చూడవె చూడు చూడవె ఓయమ్మా ఓ ముద్దులగుమ్మ , పి సుశీల , సి నారాయణ రెడ్డి
  9. నిద్దురపోరా సామీ నా ముద్దు మురిపాల సామీ చలిరాతిరి తీరేదాక తెలతెలవారేదాక , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన: సి నారాయణ రెడ్డి
  10. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు - పి.సుశీల , బి. వసంత బృందం, రచన: సి నారాయణ రెడ్డి
  11. అదుపు పొదుపు గమనించి , ఘంటసాల రచన: సి నారాయణ రెడ్డి
  12. బిరుదులు ఎన్ని ఉన్నా పదవులున్నా , ఘంటసాల,రచన: సి నారాయణ రెడ్డి
  13. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి 1970 వ సంవత్సరానికి గాను రజిత నంది అవార్డు ప్రకటించింది.

నీ ధర్మం.. మరవద్దు పాట

[మార్చు]

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే అమ్మినదెవరూ ... హరిశ్చంద్రుడూ
తండ్రి మాటకై కానల కేదినదెవరూ ... శ్రీరామచంద్రుడూ
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా ... లక్ష్మన్నా
పతియె దైవమని తరించిపోయిన దెవరమ్మా ... సీతమ్మా
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్నా
మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి
తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ
గుండు కెదురుగా గుండె నిలిపెను ఆంధ్ర కేసరీ టంగుటూరీ
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవీ
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.