Jump to content

కోట్నాక భీమ్‌రావు

వికీపీడియా నుండి
కోట్నాక భీమ్‌రావు
కోట్నాక భీమ్‌రావు


గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
  1992 నుండి 1993
నియోజకవర్గం ఆసిఫాబాదు

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
  1990

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
 1989

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
 1972

వ్యక్తిగత వివరాలు

జననం 1933
బంజార గూడెం, వాంకిడి మండలం, ఆదిలాబాద్‌ జిల్లా, తెలంగాణ
మరణం 2002, ఆగస్టు 29
హైదరాబాదు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కోట్నాక జంగు మొకాసి, బాదుబాయి
సంతానం కోవ లక్ష్మీ, మర్సుకోల సరస్వతి[1]

కోట్నాక భీమ్‌రావు (1933-2002) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక పర్యాయం ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కోట్నాక భీమ్‌రావు 1962లో అసిఫాబాద్‌ నుండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టిన తొలి ఆదివాసీ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు. ఆయన 1972లో గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఆవిర్భవించగా, ఆయన పివి.నర్సింహ్మారావు మంత్రివర్గంలో తొలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఆయన 1989లో ఖానాపూర్ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి హయాంలో (1990), కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో (1992-93) గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (5 November 2023). "ఒక్కటైన లక్ష్మి, సరస్వతి". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  2. Nava Telangana. "గిరిజనుల పెన్నిధి కోట్నాక భీమ్‌రావ్‌". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. Andhra Jyothy (30 August 2022). "ఘనంగా కోట్నాక భీంరావు వర్ధంతి". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  4. Sakshi (26 August 2023). "గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.