Jump to content

కొలుసు పార్థసారథి

వికీపీడియా నుండి
కొలుసు పార్థసారథి
కొలుసు పార్థసారథి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు జోగి రమేష్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

మాధ్యమిక విద్యా మంత్రి
పదవీ కాలం
25 నవంబర్ 2010 – 21 ఫిబ్రవరి 2014
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు మోపిదేవి వెంకటరమణ
తరువాత రాష్ట్రపతి పాలన

పశుసంవర్ధక, మత్స్య & పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
25 మే 2009 – 24 నవంబర్ 2010
గవర్నరు * ఎన్.డి. తివారీ
ముందు మండలి బుద్ధ ప్రసాద్
తరువాత తోట నరసింహం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నియోజకవర్గం నూజివీడు
పదవీ కాలం
2019 – 2024
ముందు బోడె ప్రసాద్
తరువాత బోడె ప్రసాద్
నియోజకవర్గం పెనమలూరు
పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
తరువాత బోడె ప్రసాద్
నియోజకవర్గం పెనమలూరు
పదవీ కాలం
2004 – 2009
ముందు అన్న బాబు రావు
తరువాత నియోజకవర్గం రద్దు
నియోజకవర్గం వుయ్యూరు

వ్యక్తిగత వివరాలు

జననం కొలుసు పార్థసారథి యాదవ్ (1965-04-18) 1965 ఏప్రిల్ 18 (వయసు 59)
కరకంపాడు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
(2014-2024)
భారత జాతీయ కాంగ్రెస్
(2004-2014)
తల్లిదండ్రులు కొలుసు పెద రెడ్డయ్య యాదవ్, సామ్రాజ్యం
జీవిత భాగస్వామి కె. కమలా లక్ష్మి
సంతానం కె. నితిన్ కృష్ణ
నివాసం విజయవాడ, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

కొలుసు పార్థసారథి (జ. 1965 ఏప్రిల్ 18) భారతీయ రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు శాసససభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యునిగా ఉన్నాడు. 2004, 2009, 2019 లో మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004 లో మొదటిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు, తరువాత 2009, 2019 లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆయన కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు.[1][2]

వై.ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయ మంత్రిగా పనిచేశాడు. రాజశేఖర్ రెడ్డి. పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోర్ట్‌ఫోలియోను కేటాయించాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మాధ్యమిక విద్యకు చివరి మంత్రిగా ఉన్నాడు. ఆయన 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని 2024లో వైసీపీ టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు ఇంఛార్జిగా ప్రకటించడంతో[3] కొలుసు పార్థసారథి 2024 ఫిబ్రవరి 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కరకంపాడు గ్రామంలో రాజకీయ నేపథ్యంగల కుటుంబంలోజన్మించాడు. అతని తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ రాజకీయ నాయకుడు, మచిలీపట్లం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1991, 1996 లలో ఎన్నికయ్యాడు.[5] అతని తల్లి గృహిణి.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. A. B. P. Desam (20 February 2024). "పార్టీలో చేరకుండానే కొలుసు పార్థసారధికి బాధ్యతలు - రెండు చోట్ల చాన్సిచ్చిన టీడీపీ !". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  4. Eenadu (26 February 2024). "తెదేపాలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
  5. "Machilipatnam (Andhra Pradesh) Lok Sabha Election Results 2019 - Parliamentary Constituency". www.elections.in. Archived from the original on 2021-07-16. Retrieved 2021-07-16.