Jump to content

కొలకలూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°17′N 80°35′E / 16.283°N 80.583°E / 16.283; 80.583
వికీపీడియా నుండి
కొలకలూరు
అంగలకుదురు రైల్వె స్టేషన్ నామ ఫలకం
అంగలకుదురు రైల్వె స్టేషన్ నామ ఫలకం
పటం
కొలకలూరు is located in ఆంధ్రప్రదేశ్
కొలకలూరు
కొలకలూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°17′N 80°35′E / 16.283°N 80.583°E / 16.283; 80.583
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంతెనాలి
విస్తీర్ణం
25.58 కి.మీ2 (9.88 చ. మై)
జనాభా
 (2011)
15,607
 • జనసాంద్రత610/కి.మీ2 (1,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు7,731
 • స్త్రీలు7,876
 • లింగ నిష్పత్తి1,019
 • నివాసాలు4,408
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522307
2011 జనగణన కోడ్590287

కొలకలూరు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తెనాలి నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4408 ఇళ్లతో, 15607 జనాభాతో 2558 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7731, ఆడవారి సంఖ్య 7876. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3986 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 168. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590287.[1]

సమీప గ్రామాలు

[మార్చు]

అనుమర్లపూడి 2 కి.మీ, చింతలపూడి 2 కి.మీ, నందివెలుగు 2 కి.మీ, ఈమని 5 కి.మీ, పెనుమూడి 5 కి.మీ.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

కొలకలూరు కాలువ
కొలకలూరు బ్రిడ్జి

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల తెనాలిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కొలకలూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొలకలూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

కొలకలూరు రైల్వే స్టేషను

ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 13 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కొలకలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 558 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 14 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1984 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1982 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కొలకలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1848 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 134 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కొలకలూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అరటి, పసుపు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

పచ్చళ్ళు, మిరప పొడి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో 1981-82 వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ, ఇక్కడ 2014, డిసెంబరు-14, ఆదివారం నాడు సమావేశమై, తమ పాతఙాపకాలనూ, ఆ మధురక్షణాలను గుర్తుచేసుకొని మురిసిపోయినారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించవలయునని నిర్ణయం తీసికున్నారు.

అక్షరజ్యోతి పాఠశాల

[మార్చు]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

[మార్చు]

పశువైద్యశాల

[మార్చు]

ఈ గ్రామంలో పశువైద్యశాల మొదట 1960లో దాతల సహాయంతో ఏర్పడింది. అప్పటి దాతలు శ్రీ తాళ్ళూరి సుబ్బయ్య, 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు. తొలుత, రేకుల షెడ్డులో మొదలైనది. 1970లో విద్యుత్తు సౌకర్యం కలుగజేశారు. కాలక్రమేణా ఇది తుఫానులకు శిథిలమవడంతో, 2011లో రు. 10 లక్షలు మంజూరు కాగా, నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తరువాత ఏ.డి.ఏ. నిధులు రు. 1.5 లక్షలూ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులు రు. 2 లక్షలూ మరియూ గ్రామస్తుల విరాళం రు. 2.60 లక్షలతో మొత్తం కేంద్రం నిర్మాణం పూర్తయి కొత్తరూపు సంతరించుకుని సర్వాంగ సుందరంగా తయారయినది. కార్పొరేటు వైద్యశాలలాగా ఉన్న ఈ పశువైద్యశాల, ఇప్పుడు మూగజీవాలకు సేవలందించుచున్నది.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. పరిసర గ్రామంలలో ఇది పెద్ద గ్రామం. పెద్ద గ్రామ పంచాయతీ.
  2. పి.జి. పూర్తి చేసిన, విద్యాధికురాలయిన శ్రీమతి ఉన్నం షకీల, ఈ గ్రామంనకు తొలి మహిళా సర్పంచిగా పనిచేశారు. ఈమె తన హయాలో గ్రామ సమస్యలపై దృష్టి సారించి పెద్ద పంచాయతీ అయిన కొలకలూరు గ్రామ ప్రగతికి నిదర్శనంగా నిలిచారు. గ్రామజనాభాకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పరిచారు.
  3. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో శ్రీమతి కాలిశెట్టి లక్ష్మీ నాంచారమ్మ, 382 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కాశీ విశాలాక్షీ సమేత శ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం

[మార్చు]

శ్రీ కోదండరామస్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం నిర్మాణంలో ఉంది. శివాలయానికి ఆనుకొని నిర్మిస్తున్న ఈ ఆలయంలో, శ్రీ కోదండరామస్వామి, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించుచున్నారు. 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుచున్న ఈ ఆలయం 2014, మార్చి నెలాఖరు నాటికి పూర్తికాగలదు.

శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

[మార్చు]

కొలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపయ్యపేటలో ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని, శ్రీ నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు అందజేయగా, తెనాలి వైకుంఠపురం దేవాలయ మాజీ ఛైర్మన్ నంబూరి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. కొన్ని రోజుల దక్షిణభారతదేశంలో ఎక్కడా ఇలాంటి ఆలయం లేకపోవడంతో, గ్రామస్థుల కోరికతో, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దినారు. చెన్నైకి చెందిన ఆలయాల శిల్పి శ్రీ సుందరరాజన్ అయ్యంగార్, సూరిబాబుల ఆలోచనలతో దేవతామూర్తులు, నగిషీలతో ఆలయాన్ని తీర్చిదిద్దినారు.

ఈ ఆలయ విగ్రహప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా, 2016, ఫిబ్రవరి-27వ తేదీ, మాఘ బహుళ పంచమి శనివారంనాడు, ఉదయం ప్రత్యేకపూజలు ఘనంగా నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, నవగ్రహమండపారాధన, విగ్రహాలకు క్షీరాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణం, హోమం, పుష్పాధివాసం, దర్బారుసేవ పూజలు నిర్వహించారు. 28వ తేదీ ఆదివారం ఉదయం శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చేతులమీదుగా, మహా గణపతి, కుమారస్వామి, గాయత్రీ మాత, పంచముఖేశ్వరస్వామి, మహానందీశ్వరుడు, శ్రీ నాగేంద్రస్వామి, కాలభైరవ, ద్వారపాలక, నవగ్రహసమేత జీవవధ్వజష్తంభ విగ్రహప్రతిష్ఠ వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య, నిర్వహించారు. అనంతరం, పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [14]

గామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

ఈ గ్రామంన వ్యవసాయము చేయువారు ఎక్కువ.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-16న, జిల్లా లాలా థామస్ కళాకారుల సేవా సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు. సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డోలు కళాకారులను సత్కరించారు.
  2. కొలకలూరు గ్రామంలోని "కొలకలూరు గ్రామ కళా పరిషత్తు" అను సంస్థవారు, ఈ గ్రామంలో 2015, జూన్-7,8.9 తేదీలలో రాష్ట్రస్థాయి నాటక పోటీలను ఏర్పాటు చేసారు.
  3. ఈ గ్రామ పాఠశాలలో పనిచేయుచున్న ఆవుల లక్ష్మీసామ్రాజ్యం అను ఉపాధ్యాయిని, నడక పోటీలలో జాతీయస్థాయిలో పతకాలు సాధించుచున్నది.
  4. 2016, జనవరిలో, తిరుపతిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో, కొలకలూరు గ్రామ కళాకారులు, ఆరు నంది పురస్కారాలను పొందినారు. వీరికి తిరుపతిలో 2016, జనవరి-27న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు బహుమతి ప్రదానం చేసారు.

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 15764, పురుషుల సంఖ్య 7970, మహిళలు 7794, నివాసగృహాలు 3931, విస్తీర్ణం 2558 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=కొలకలూరు&oldid=4354972" నుండి వెలికితీశారు