కొమర్రాజు అచ్చమాంబ
కొమర్రాజు అచ్చమాంబ | |||
![]() కొమర్రాజు అచ్చమాంబ | |||
MP
| |||
ముందు | హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ | ||
---|---|---|---|
తరువాత | కానూరి లక్ష్మణరావు | ||
నియోజకవర్గం | విజయవాడ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సెప్టెంబరు 6, 1906 గుంటూరు, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | వి. వెంకటరామశాస్త్రి | ||
సంతానం | ఒక కుమార్తె | ||
మతం | హిందూమతం | ||
వెబ్‌సైటు | [1] |
కొమర్రాజు అచ్చమాంబ (1906-1964) ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేసింది. విద్యార్థి దశనుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్నది. ఆవిడ కొమర్రాజు లక్ష్మణరావు పుత్రిక.
జీవిత విశేషాలు
[మార్చు]అచ్చమాంబ చరిత్రకారుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, కోటమాంబ దంపతులకు 1906, సెప్టెంబరు 6న గుంటూరులో జన్మించింది. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1940లో ఈమెకు వి. వెంకటరామశాస్త్రితో వివాహమైంది. దంపతులకు టాన్యా అనే ఒక కుమార్తె జన్మించింది. 2006 లో, ఈమె శతజయంతి ఉత్సవాలను హైదరాబాదులో జరుపుకున్నారు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]1924 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928 లో మద్రాసు నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెసులో చేరింది. 1957 లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.
రచనలు
[మార్చు]అచ్చమాంబ సాంప్రదాయకంగా పిల్లల పెంపకంలో వస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్దేశించి తెలుగులో ప్రసూతి – శిశుపోషణ అన్న పుస్తకాన్ని వ్రాసింది. ఈమె 1946 లో ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన "మహిళ" అనే స్త్రీల కొరకు ఉద్దేశించబడిన మాసపత్రికకు సంపాదకత్వం వహించింది. అయితే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలువడింది.[2][3]
ఓల్గా అచ్చమాంబ జీవితాన్ని అధారం చేసుకొని గమనమే గమ్యం అనే నవల రచించింది. ఇది తెలుగులో 2016లో ప్రచురించబడింది. ఆంగ్లంలోకి ది సిక్ల్ & ది స్కాల్పెల్ అనే శీర్షికతో అనువదించబడింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "In Hyderabad Today". The Hindu. 6 October 2006. Archived from the original on 20 జూలై 2011. Retrieved 15 October 2010.
- ↑ Satyavathi, Kondaveeti (2009). "Hitha Suchani to Bhumika: Women's Magazines in Telugu" (PDF). Sparrow Newsletter. 61 (16–17): 3–4. Archived from the original (PDF) on 23 జూలై 2011. Retrieved 15 October 2010.
- ↑ Studies in the history of Telugu journalism: presented to V. R. Narla on the occasion of his shashtyabdapurti
- ↑ "గమనమే గమ్యం : చారిత్రక సందర్భం, gamaname gamyam goparaju laxmi". madhuravani. Retrieved 2025-04-02.
- ↑ Ōlgā (2022). The sickle & the scalpel. Translated by Kannabiran, Vasantha. Hyderabad, Telangana, India: Orient BlackSwan Private Limited. ISBN 978-93-5442-314-7.