Jump to content

కొత్తగూడెం విమానాశ్రయం

వికీపీడియా నుండి
కొత్తగూడెం విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
యజమానిభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
ప్రదేశంకొత్తగూడెం, తెలంగాణ, భారతదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు

కొత్తగూడెం విమానాశ్రయం, తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ప్రతిపాదించబడిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం కోసం తెలంగాణా ప్రభుత్వం కొత్తగూడెం మండలంలోని పునుకుదుచెల్క గ్రామంలో 1,600 ఎకరాల భూమిని గుర్తించింది.[1] స్టీరింగ్ కమిటీ ప్రతిపాదిత ఏరోడ్రోమ్ కోసం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలపై సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. హైదరాబాద్ విమానాశ్రయం తర్వాత రాష్ట్రంలో రెండవ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఇది.[2][3]

చరిత్ర

[మార్చు]

2008లో కర్నూలులో విమానాశ్రయంతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, ప్రతి విమానాశ్రయానికి ₹ 50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 500–600 ఎకరం (2.0–2.4 కి.మీ2) విస్తీర్ణంలో 6,000 అడుగులు (1,800 మీ.) రన్‌వే పొడవుతో విమానాశ్రయం ఉండాలని పేర్కొంది.[4] అయితే, విమానాశ్రయం నిర్మాణానికి తగినంత భూమి అందుబాటులో లేనందున భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.[5]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెట్రోపాలిటన్ నగరాల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు ఎయిర్ కనెక్టివిటీని విస్తరించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, విమానాశ్రయం నిర్మించడానికి కావలసిన భూమి సేకరణ ప్రారంభించింది. కొత్తగూడెం పట్టణానికి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు సైట్‌ను ప్రతిపాదించగా 2021 జనవరి 6న విమానాశ్రయ అధికారులు ప్రతిపాదిత భూమిని సందర్శించి పరిశీలించారు.[6]

ఇతర వివరాలు

[మార్చు]
  1. 2015 జనవరి: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అప్పటి భారత పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలిసి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి సహకారం అందించాలని కోరాడు.
  2. 2015 ఫిబ్రవరి: విమానాశ్రయ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడానికి తనిఖీ బృందాన్ని పంపనున్నట్లు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
  3. 2015 ఆగస్టు: కొత్తగూడెం నుండి 20 కిలోమీటర్ల దూరంలో పునుకుడుచెల్కలో విమానాశ్రయం కోసం 1600 హెక్టార్ల స్థలాన్ని గుర్తించారు.
  4. 2016 సెప్టెంబరు: విమానాశ్రయం ప్రాజెక్ట్ కోసం సైట్ క్లియరెన్స్ సిఫార్సు చేయబడింది.
  5. 2016 డిసెంబరు: ఘజియాబాద్ గ్రీన్‌సిండియా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, "వన్యప్రాణుల అభయారణ్యంలో సాధారణంగా ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడవు" అని పేర్కొంటూ విమానాశ్రయ ప్రాజెక్ట్ కోసం "అవకాశాలు తక్కువగా ఉన్నాయి" అని సలహా ఇచ్చింది
  6. 2017 మార్చి: కొత్తగూడెం - పాల్వొంచ పట్టణాల మధ్య సుమారు 1600 ఎకరాల భూ సేకరణపై విమానాశ్రయం అభివృద్ధి ఆధారపడి ఉందని పౌర విమానయాన శాఖ తెలిపింది.
  7. 2021 జనవరి: విమానాశ్రయ అధికారులు కొత్తగూడెం - పాల్వొంచ పట్టణాల మధ్య ప్రతిపాదిత భూమిని సందర్శించి పరిశీలించారు.
  8. 2021 ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో ఆరు దేశీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసే ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థల మధ్య కీలక సమావేశం జరిగింది. ప్రతిపాదిత విమానాశ్రయాలలో 18 నుండి 20 మంది వ్యక్తులు కూర్చునే సామర్థ్యంతో మినీ విమానాల నిర్వహణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Kothagudem airport plan set in motion". The Hindu. 4 December 2015. Retrieved 2 September 2021.
  2. "Airport at Kothagudem to take wing soon". The Hindu. 30 May 2016. Retrieved 2 September 2021.
  3. "Govt panel clears three new airports in Andhra Pradesh". The Times of India. 26 September 2016. Retrieved 2 September 2021.
  4. Chowdhury, Anirban (19 January 2008). "Andhra plans 8 small airports". Rediff India Abroad. Archived from the original on 3 మే 2008. Retrieved 2 September 2021.
  5. C.R., Sukumar (2 October 2009). "Andhra to invite bids for 4 airports with new incentives". Mint. Archived from the original on 4 April 2021. Retrieved 2 September 2021.
  6. India, The Hans (2021-01-06). "Kothagudem: Collector Dr MV Reddy inspects land proposed for airport construction". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2 September 2021.
  7. "Key meet on new Telangana airports soon". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-12. Retrieved 2 September 2021.