డాక్టర్ కొండపల్లి నీహారిణి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో 1963, డిసెంబరు 8న జన్మించారు. ఈవిడ తండ్రి పెండ్యాల రాఘవరావు రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు కాగా, తల్లి కౌసల్యా దేవి. తన కుటుంబ సాహిత్య, రాజకీయ నేపథ్యం నుండి ప్రేరణ పొందిన నీహారిణి జీవితంలో ప్రారంభంలోనే తెలుగు సాహిత్యంపై అభిరుచిని పెంచుకున్నారు. నీహారిణి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. (తెలుగు), కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (తెలుగు) చదివారు. 2016లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "ఒద్దిరాజు సోదరులు జీవితం-సాహిత్యం" అనే పరిశోధనాంశంతో పిహెచ్.డి. డాక్టరేట్ అందుకున్నారు.[2]
డాక్టర్ నీహారిణి తెలుగు ఉపాధ్యాయురాలిగా తన వృత్తిని ప్రారంభించారు. 1988 నుండి 2012 వరకు పనిచేశారు. సాహిత్యంపై ఆమెకున్న మక్కువ ఆమెను కవయిత్రి, రచయిత్రి, సంపాదకురాలు, వక్తగా మార్చింది. ఆమె కవితా సంపుటాలు, కథా సంపుటాలు, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలతో సహా పలు పుస్తకాలను ప్రచురించారు. "అర్ర తలుపులు" (2011), "నిర్నిద్ర గానం" (2012), "ఎనిమిదో అడుగు" (2018), "కాల ప్రభంజనం" (2021) ముఖ్యమైన రచనలు. ఆమె తెలుగు అకాడమీకి జీవిత చరిత్రలు, "తెలంగాణ వేగుచుక్కలు" (2017) అనే పరిశోధనా రచనను కూడా రాశారు.[2]
నీహారిణి ఆన్‌లైన్ సాహిత్య పత్రిక "మయూఖ", మహిళా పత్రిక "తరుణి" స్థాపకురాలిగా, ప్రధాన సంపాదకురాలిగా ఉన్నారు. మహిళల విజయాలు, సాహిత్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 'తరుణి యూట్యూబ్' ఛానల్‌ని కూడా నడుపుతున్నారు.
సాహిత్యానికి నీహారిణి చేసిన కృషికి అనేక అవార్డులు అందుకున్నారు.[2]
షీ ఫౌండేషన్ నుండి 'షీ' అవార్డు (2012)
2015 తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న కొండపల్లి నీహారిణితెలుగు విశ్వవిద్యాలయం నుండి జీవిత చరిత్ర విభాగంలో కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్రకు కీర్తి పురస్కారం (2014)
కొండపల్లి వేణుగోపాలరావు (రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్)తో నీహారిణి వివాహం జరిగింది. వీరికి దీప్తి, భార్గవ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రఖ్యాత జాతీయ కళాకారుడు, హంస అవార్డు గ్రహీత కొండపల్లి శేషగిరిరావు ఈవిడ మామగారు.[3]
తెలుగు సాహిత్యానికి నీహారిణి చేసిన కృషి, సాహిత్యం ద్వారా స్త్రీల సాధికారత కోసం ఆమె చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపారు. ఆమెకున్న అంకితభావం, సాహిత్య వృత్తిని తన వ్యక్తిగత జీవితంతో సమతుల్యం చేసుకునే సామర్థ్యంతో నీహారిణి అనేకమంది ఔత్సాహిక రచయితలకు రోల్ మోడల్‌గా నిలిచారు.
↑Tempest of Time: 4-years lament of Dr Kondapalli Neeharini by Chitiprolu Subba Rao, The South India Times, Edit Page, Hyderabad Edition, 2023 February 17, Page No. 2.