కైలాసం రాఘవేంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైలాసం రాఘవేంద్రరావు
జననం1958
చెన్నై, తమిళనాడు
వృత్తిపారిశ్రామికవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

కైలాసం రాఘవేంద్రరావు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త, ఆర్కిడ్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ స్థాపకుడు. ఒక సమయంలో ఆ కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డి అండ్ బి లిస్టింగ్‌లో అగ్రశ్రేణి 500 భారతీయ కంపెనీలలో ఒకటిగా ఉండేది.[1] 2011 లో భారత ప్రభుత్వం, నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో రావును సత్కరించింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

రాఘవేంద్రరావు 1958 లో తమిళనాడు లోని చెన్నైలో జన్మించాడు.[3] అతను 1977 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ చేసాడు. 1979 లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.[3][4][5]

రావు 1979 లో, ప్యూర్ ఐస్ క్రీమ్స్[4][5] లో ఫైనాన్షియల్ కంట్రోలరుగా తన వృత్తిని ప్రారంభించాడు. 1981 లో అశోక్ లేలాండ్‌కు మారాడు.[4][5] హైదరాబాదు లోని స్టాండర్డ్ మెడికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కి[4][5] వెళ్లడం అతన్ని ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు పరిచయం చేసింది. ఈ సంవత్సరాల్లో, రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అసోసియేట్‌షిప్ కంపెనీ సెక్రటరీ (ACS) లకు చెందిన ICWAI కాస్ట్ అకౌంటింగ్ అర్హత సాధించాడు.[3] తదుపరి, 1982 లో ఒమన్‌ దేశం, మస్కట్ వెళ్ళి అక్కడ అల్ బురైమ్ గ్రూప్[4][5] లో పనిచేశాడు. 1992 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను స్వంతంగా ఆర్చిడ్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించాడు. కొద్ది సంవత్సరాలలో అది, భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది.[4][5]

రాఘవేంద్రరావు 1997లో ఇండియా యంగ్ బిజినెస్ అచీవర్ అవార్డు, 1999లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు.[3][5] 2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.[2] అతను ఆర్కిడ్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఆర్కిడ్ న్యూట్రికేర్ లిమిటెడ్, UK, BEXEL ఫార్మాస్యూటికల్స్, అల్ బురైమి గ్రూప్‌లలో డైరెక్టరుగా ఉన్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "DNB Listing". DNB. 2007. Archived from the original on 22 March 2012. Retrieved 23 November 2014.
  2. 2.0 2.1 "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  3. 3.0 3.1 3.2 3.3 "Bio" (PDF). Orchid. 2014. Retrieved 23 November 2014."Bio" (PDF). Orchid. 2014. Retrieved 23 November 2014.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "India Info Online". India Info Online. 2014. Retrieved 23 November 2014."India Info Online". India Info Online. 2014. Retrieved 23 November 2014.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 "Business Week". Business Week. 21 November 2014. Archived from the original on 23 నవంబర్ 2014. Retrieved 23 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help). Business Week. 21 November 2014. Archived from the original on 23 November 2014. Retrieved 23 November 2014.