రాజకీయ నాయకుడు, సామాజిక వేత్త, విద్యావేత్త, పాత్రికేయుడు
కంచెర్ల కేశవ రావు (జననం 1939 జూన్ 4) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.[2] భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరుపున భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3] 2014 ఫిబ్రవరి 7న ఆయన రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యాడు.[4]
కే కేశవ రావు 2024 మార్చి 29న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించాడు.[5] ఆయన 2024 జూలై 3న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.[6]
కే. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి జూలై 4న రాజీనామా చేయగా,[7] ఆయనను జూలై 6న రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.[8]
అతను 1940, డిసెంబరు 13న తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్లో నిరంజన్ రావు, గోవిందమ్మలకు జన్మించాడు (అధికారిక రికార్డులలో పుట్టిన తేదీ 1939 జూన్ 6 అని ఉంది).[9] అతను బద్రుకా కాలేజీలో బి.కామ్ చేసాడు, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ., తరువాత పి.హెచ్.డి చేసాడు.
మహబూబ్ కాలేజీ ఎంపి హైస్కూల్లో టీచర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి తరువాత జర్నలిస్టుగా, నటుడు, నిర్మాతగా పనిచేశాడు. హైదరాబాద్ నుండి ముద్రించిన ఆంగ్లంలో ప్రసిద్ధ దినపత్రిక ది డైలీ న్యూస్ సంపాదకుడిగా కూడా ఉన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ, ది పేట్రియాట్‌లో ఢిల్లీలో అప్రెంటిస్ పొందాడు. ఆయన రచనలకు మంచి ఆదరణ లభించింది. అతను అత్యవసర పరిస్థితిని (1975-77) వ్యతిరేకించాడు, ముఖ్యంగా మీడియా సెన్సార్‌షిప్, దాని కోసం ది డైలీ న్యూస్ బ్లాక్ లిస్ట్ చేయబడింది.
డాక్టర్ రావు పార్టీ, ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులను కలిగి ఉన్న సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు. అతను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (2005) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, తరువాత 2009 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) లో సభ్యుడయ్యాడు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు నాలుగు రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాల బాధ్యతలు నిర్వహించాడు.
డాక్టర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడు ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు, విద్య, పరిశ్రమ, కార్మిక వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించాడు. అంతకుముందు కేశవ రావు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా కూడా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యాడు. కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా, క్యాబినెట్ ర్యాంకుతో రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.
అతను 2006-2012 మధ్యకాలంలో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అతను తెలంగాణలో వామపక్ష భావాలు కలిగిన గొప్ప రాజకీయవేత్త. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే గడువును పార్టీ తీర్చలేదు. అందువల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న డాక్టర్ రావు 2013, మే నెలలో, కాంగ్రెస్ పార్టీ నుండి నుంచి వైదొలిగారు. తరువాత అతను ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో, మరో ఇద్దరు పార్లమెంటు సభ్యులతో కలిసి చేరాడు. ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్‌గా, దాని జాతీయ వ్యవహారాల ఛైర్మన్‌గా పార్టీలో రెండవ స్థానంలో నియమించబడ్డాడు. డాక్టర్ రావు 2014 లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఆరేళ్ళ కాలానికి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 12 మంది సభ్యులతో పార్లమెంటులో ఎనిమిదవ అతిపెద్ద పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ (నాయకుడు) గా ఆయన ఎంపికయ్యాడు.[10]
డాక్టర్ రావు ప్రముఖ విద్యార్థి నాయకుడు, విశ్వవిద్యాలయం, జాతీయ స్థాయిలో ఎన్నికైన పదవులను నిర్వహించారు. అతను ట్రేడ్ యూనియన్ నాయకుడు. వెనుకబడిన తరగతులు, పౌర హక్కుల వంటి అనేక ప్రజల ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. రావు అనేకసార్లు పోలీసుల అరెస్టులను ఆశ్రయించాడు, నిర్బంధాలకు గురయ్యాడు. అతను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్థానిక వార్తాపత్రికలు, టివి ఛానెల్స్ డాక్టర్ రావు గారు ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారని ఈ శతాబ్దపు మొదటి దశకంలో వార్తలు ప్రచురించాయి. 1979లో తెలుగులో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్న నిమజ్జనం చలనచిత్రానికి చిత్ర నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఉన్నాడు,[11]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.పి. నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బాధ్యతను నిర్వర్తించాడు.[15]