Jump to content

కేసనపల్లి లక్ష్మణకవి

వికీపీడియా నుండి
కేసనపల్లి లక్ష్మణకవి

కేసనపల్లి లక్ష్మణకవి సహజకవి, పండితుడు, విమర్శకుడు, పౌరాణికుడు. ఇతడు నరసరావుపేట సమీపంలోని కేసనపల్లి వాస్తవ్యుడు. ఇతడు గురుముఖతః అక్షరాలు మాత్రం నేర్చుకున్నాడు. స్వయంకృషితో భారత రామాయణాలను కంఠస్థం చేసి సాహిత్యపు లోతులను ఆకళింపు చేసుకున్నాడు. చిన్నతనంలేనే అవధానాలు చేశాడు. ఆజన్మ బ్రహ్మచారి. ఇతని కవిత్వం వావిలికొలను సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, గుఱ్ఱం జాషువా మొదలైన కవుల ప్రశంసాపాత్రమైంది.[1]

రచనలు

[మార్చు]
  • చెన్నకేశవ శతకం
  • రఘురామ శతకం
  • త్య్రంబకేశ్వర శతకం
  • జానకీ పరిణయం (ప్రబంధం)

ఇవి కాక వేలకొలది ఆశుపద్యాలు, చాటువులు రచించాడు.

బిరుదులు

[మార్చు]
  • కుకవిఘూకవి రవి

మరణం

[మార్చు]

ఇతడు తన 78వ యేట 1979, జనవరి 14వ తేదీన మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. చేరెడ్డి, మస్తాన్ రెడ్డి (17 June 1979). "ఆజన్మ బ్రహ్మచారి సాహిత్య సంచారి కీ.శే.కేసనపల్లి లక్ష్మణకవి గారు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66 సంచిక 76. Retrieved 23 December 2017.[permanent dead link]