కె.విజయానంద్
కావేటి విజయానంద్ | |
---|---|
![]() | |
జననం | 1965 నవంబరు 18 |
జాతీయత | భారతీయుడు |
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు |
కావేటి విజయానంద్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐ.ఎ ఎస్ అధికారి. ఆయన 1992లో ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎ.పి.జెన్‌కోకు మానేజింగ్ డైరక్టరు, డైరక్టరుగా ఉన్నప్పుడు ఆ సంస్థ ఇండియా పవర్ అవార్డును 2008,2009,2011,[1] 2012 లలో అందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FAPCCI) యొక్క 93వ వార్షికోత్సవ ఎక్స్‌లెన్స్ అవార్డు 2009-10 ని పారిశ్రామిక ఉత్పాదకత ప్రావీణ్యతకు గానూ అందుకున్నారు,[2] 2010 లో సుశీల్ కుమార్ షిండే నుండి ధర్మల్ పవర్ స్టేషన్ల పెర్‌ఫార్మెన్స్ (డా. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్) కొరకు జాతీయ అవార్డును అందుకున్నారు.[3] ఆయన నవంబరు 22 2013 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్ది చేతులమీదుగా "సి.ఇ.ఒ ఆఫ్ ద యియర్ (స్టేట్ థెర్మల్) అవార్డు"ను అందుకున్నారు.[4]
వృత్తి జీవితం
[మార్చు]కె. విజయానంద్1992 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన 1993లో మొదట ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, 1997-2007 వరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, అనంతరం శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశాడు. ఆయన రాష్ట్ర విభజన అనంతరం 2016 - 2019 వరకు ఐటీ అండ్ ఎలకా్ట్రనిక్స్ ముఖ్య కార్యదర్శిగా, 2019 - 2021 వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా, 2022లో ఆంధ్రప్రదేశ్ జెన్కో చైర్మన్‌గా, 2023లో ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
కె.విజయానంద్ 2024 డిసెంబర్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "APGENCO bags The India Power Award-2011 for Overall Utility Performance Generation". Newswala.com. 2011-11-25. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.
- ↑ "News and Events". Apgenco.gov.in. Archived from the original on 2014-02-19. Retrieved 2014-03-01.
- ↑ "News and Events". Apgenco.gov.in. 2010-01-29. Archived from the original on 2013-10-09. Retrieved 2014-03-01.
- ↑ "News and Events". Apgenco.gov.in. 2013-11-22. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.
- ↑ "ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్". 30 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే." Andhrajyothy. 30 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "Senior IAS K Vijayanand is next chief secretary of Andhra Pradesh". 30 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.