కె.కళ్యాణసుందరం పిళ్ళై
తిరువిదైమరుదూర్ కుప్పయ్య కళ్యాణసుందరం పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | తిరువిదైమరుదూర్, తమిళనాడు, భారతదేశం | 1932 మార్చి 1
సంగీత శైలి | భరత నాట్యం (తంజావూర్ బాణీ) |
వృత్తి | భరతనాట్యం కళాకారుడు |
కుప్పయ్య కళ్యాణసుందరం పిళ్ళై భరతనాట్య కళాకారుడు, నాట్య గురువు.[1]
విశేషాలు
[మార్చు]ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా తిరువిదైమరుదూరు గ్రామంలో 1932 మార్చి 1 గ్రామంలో ఒక సంప్రదాయ భరతనాట్య నట్టువనార్ల కుటుంబంలో జన్మించాడు.[2] ఇతని ముందు ఏడు తరాల వారు నట్టువాంగం విద్యలో రాణించినవారే. ఇతడు భరతనాట్యాన్ని తన తండ్రి కుప్పయ్య పిళ్ళై వద్ద, తన అన్నయ్య టి.కె.మహాలింగం పిళ్ళై వద్ద, తన బావ గోవిందరాజ పిళ్ళై, అక్క కరుణాంబాళ్ వద్ద నేర్చుకున్నాడు. అభినయాన్ని తన తాల పంచాపకేశ నట్టువనార్ వద్ద అభ్యసించాడు. తన 6వయేట కుంభకోణంలోని కుంభేశ్వర ఆలయంతో తన తొలి నాట్యప్రదర్శన ఇచ్చాడు.
ఇతడు తిరుకుట్రాల కురవంజి (వసంతవల్లి), శ్రీ అండాళ్, స్కందలీల, కృష్ణలీల, త్యాగబ్రహ్మాంజలి, పురందరవందన, జయ జయ కృష్ణ, భక్తి నృత్య, మహాత్మాంజలి, నందనార్ వంటి నృత్య రూపకాలకు నృత్యదర్శకత్వం వహించాడు. ఇతడు "నందనార్"ను 2002లో లాస్ ఏంజెల్స్‌లో ప్రదర్శించి మంచి ప్రశంసలను అందుకున్నాడు. చైనాలో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్‌కు భారతదేశం తరఫున వెళ్ళిన 10మంది నాట్యకళాకారులకు నేతృత్వం వహించాడు. ఇతడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా, ఇండోనేసియా, కొలంబియా, మెక్సికో, జపాన్, మలేసియా, సింగపూర్, నేపాల్ దేశాలలో జరిగిన నృత్యోత్సవాలలో పాల్గొన్నాడు.
ఇతడు అనేక మందికి భరతనాట్యం నేర్పించాడు. వారిలో సుధా చంద్రశేఖర్, మాళవికా సరుక్కై, వాణి గణపతి, లతా పాద, ప్రీతి వారియర్, సునీతా పిళ్ళై, విజి ప్రకాష్, గౌరీ రావు, పద్మజా సురేష్ మొదలైన వారున్నారు.
ఇతడు భరతనాట్యానికి చేసిన సేవలను గుర్తించి అనేక సంస్థలు అనేక పురస్కారాలను ప్రకటించాయి. సంగీత నాటక అకాడమీ అవార్డు, కళైమామణి పురస్కారం, మద్రాసు సంగీత అకాడమీ ఉత్తమ నాట్యాచార్య పురస్కారం మొదలైనవి వాటిలో కొన్ని.
మూలాలు
[మార్చు]- ↑ web master. "K. Kalyanasundaram Pillai". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
- ↑ అనితా రత్నం. "Guru K Kalyanasundaram". నర్తకి. Retrieved 25 April 2021.