కెమిలో
స్వరూపం
Chamilo | |
---|---|
అభివృద్ధిచేసినవారు | Chamilo community members and professional partners |
సరికొత్త విడుదల | LMS 1.11.26 / 27 సెప్టెంబరు 2023 |
ప్రోగ్రామింగ్ భాష | PHP |
నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
రకము | Course Management System |
లైసెన్సు | GPLv3 or superior |
వెబ్సైట్ | chamilo.org |
కెమిలో అనేది ఒక ఉచిత సాఫ్ట్వేర్ ( GNU/GPL లైసెన్సింగ్ ) ఇ-లెర్నింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞాన ప్రాప్యత మెరుగుపరచడానికై ఉద్దేశించబడింది. ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రచారం, ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించే కంట్రిబ్యూటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడం వంటి లక్ష్యాలకై కెమిలో అసోసియేషన్ తన సహాయ సహకారాలను అందిస్తుంది.
కెమిలో ప్రాజెక్ట్, ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా పంపిణీ చేయడం, తక్కువ ఖర్చుతో విద్య యొక్క లభ్యత, నాణ్యతను నిర్ధారించడం, [1] 3వ ప్రపంచ దేశాల పరికరాల పోర్టబిలిటీ కోసం ఇంటర్ఫేస్కు మెరుగులద్దడం, [2] తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడం, ఉచితంగా పబ్లిక్ ఇ-లెర్నింగ్ క్యాంపస్‌ని అందించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుంది.[3]