Jump to content

కెఎఫ్‌సీ

వికీపీడియా నుండి
KFC is an American fast food restaurant
కెంటకి ఫ్రైడ్ చికెన్ (KFC)
కేఎఫ్‌సీ

కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సీ) వేయించిన చికెన్ (ఫ్రైడ్ చికెన్) కు పేరుపడి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చెయిన్. అమెరికాలోని కెంటకీ ప్రాంతంలో ఈ చెయిన్ ప్రధాన కార్యాలయం నెలకొంది. మెక్ డొనాల్డ్స్ తర్వాత సేల్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద రెస్టారెంట్ చెయిన్ - కెఎఫ్‌సీ. కెఎఫ్‌సీలో డిసెంబరు 2013 నాటికి 118 దేశాలు, ప్రాంతాల్లో 18,875 అవుట్ లెట్లు ఉన్నాయి. యమ్! బ్రాండ్స్ కి కంపెనీ అనుబంధ సంస్థ, పిజ్జా హట్, టాకో బెల్ వంటి చెయిన్లు కూడా సంస్థ నిర్వహిస్తోంది.

కార్బిన్, కెంటకీలో 1930ల నాటి తీవ్రమైన మాంద్యం కాలంలో వ్యాపారవేత్త హార్లాండ్ శాండర్స్ రోడ్డుపక్కన వేయించిన చికెన్ అమ్మే రెస్టారెంట్ గా కెఎఫ్‌సీ ప్రారంభమైంది. శాండర్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీలు ఏర్పరచడంలో అవకాశాలను గుర్తించి 1952లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ మొట్టమొదటి ఫ్రాంఛైజ్ ని యూటాలో ప్రారంభించారు. కెఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ రంగంలో చికెన్ ను వ్యాప్తిలోకి తీసుకువచ్చి, మార్కెట్లో హ్యాంబర్గర్ ఆధిక్యత నుంచి వైవిధ్యాన్ని తీసుకువచ్చారు. తనను తాను బ్రాండ్ చేసుకోవడంతో కల్నల్ శాండర్స్ అమెరికన్ సాంస్కృతిక చరిత్రలో ప్రాముఖ్యం చెందిన వ్యక్తిగా నిలిచారు, అతని బొమ్మ కెఎఫ్‌సీ ప్రకటనల్లో విస్తృతంగా వినియోగించుకున్నారు. ఐతే వేగవంతంగా విస్తరిస్తున్న కంపెనీ బాధ్యతలు వయసు మీద పడ్డ తనకు భారం కావడంతో 1964లో జాన్ వై.బ్రౌన్, జాక్ సి.మెస్సీల నాయకత్వంలోని పెట్టుబడిదారుల సముదాయానికి అమ్మేశారు.

1960ల మధ్యకాలంలో కెఎఫ్‌సీ కెనడా, బ్రిటన్, మెక్సికో, జమైకాల్లో  విస్తరణ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మొదటి కొద్ది ఫుడ్ చెయిన్లలో ఒకటిగా నిలిచింది. 

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కెఎఫ్‌సీ&oldid=3256073" నుండి వెలికితీశారు