Jump to content

కెంబూరి రామ్మోహన్ రావు

వికీపీడియా నుండి
కెంబూరి రామ్మోహన్ రావు

పదవీ కాలం
1985 - 1989
ముందు త్రిపురాన వెంకట రత్నం
తరువాత టంకాల సరస్వతమ్మ
నియోజకవర్గం చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1989 - 1991
ముందు పూసపాటి ఆనంద గజపతి రాజు
తరువాత పూసపాటి ఆనంద గజపతి రాజు
నియోజకవర్గం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 అక్టోబరు 1949
పుర్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి రుషి
సంతానం 2 కుమార్తెలు (మైథిలి కెంబూరు, సౌజన్య కెంబూరి)
నివాసం లావేరు రోడ్, చీపురుపల్లి, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు [1]

కెంబూరి రామమోహనరావు ( 1949 అక్టోబరు 12 - 2024 ఆగస్ట్ 8) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

కెంబూరి రామ్మోహనరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబరు 12 వ తేదీన జన్మించాడు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టాను పొందాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను 1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు.[1] 1989లో తొమ్మిదవ లోక్ సభ సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండిబొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. అహర్నిశలు పేద వర్గాల అభివృద్ధి కోసం శ్రమించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను 1974లో రుషిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు.

మరణం

[మార్చు]

కెంబూరి రామ్మోహనరావు అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2024 ఆగస్ట్ 8న మరణించాడు. ఆయనకు భార్య రుషేంద్రమణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Statistical Report of General Elections, 1985 to The Legislative Assembly of Andhra Pradesh.
  2. Andhrajyothy (8 August 2024). "మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. Eenadu (8 August 2024). "మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావు కన్నుమూత". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.

బాహ్య లంకెలు

[మార్చు]