కృష్ణ రాఘవ జయేంద్ర భరత్
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ | |||
| |||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 13 నవంబరు 1988 చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | చంద్రమౌళి, పద్మజ | ||
జీవిత భాగస్వామి | దుర్గాపద్మిని | ||
సంతానం | ఆరా |
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కృష్ణరాఘవ జయేంద్రభరత్ 1988 నవంబరు 13లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో చంద్రమౌళి, పద్మజ దంపతులకు జన్మించాడు. ఆయన బీటెక్ వరకు చదువుకున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కృష్ణరాఘవ జయేంద్రభరత్ తన తండ్రి చంద్రమౌళి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019లో వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. జయేంద్రభరత్‌ను చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021 నవంబరు 12న వైయస్ఆర్‌సీపీ ప్రకటించింది.[2][3] ఆయన 2021 నవంబరు 18నన నామినేషన్ దాఖలు చేశారు.[4] భరత్ 2021 డిసెంబరు 3న ఏకగ్రీవంగా ఎన్నికై, [5][6] 2021 డిసెంబరు 8న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]
ఆయన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు చేతిలో 48,006 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Andhrajyothy (13 November 2021). "కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జి భరత్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ Eenadu (13 November 2021). "వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
- ↑ Prabha News (18 November 2021). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భరత్ నామినేషన్". Archived from the original on 18 November 2021. Retrieved 1 January 2022.
- ↑ Eenadu (13 November 2021). "భరత్ ఎన్నిక..ఏకగ్రీవమే!". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
- ↑ Sakshi (3 December 2021). "11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 3 December 2021. Retrieved 1 January 2022.
- ↑ Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Legislative Assembly election Results". Retrieved 20 October 2024.