కృష్ణ పక్షము (పుస్తకం)
స్వరూపం
కృష్ణపక్షము | |
కృతికర్త: | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
---|---|
అంకితం: | మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరు |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవితా సంపుటి. |
ప్రచురణ: | ఓరియంట్ లాజ్మన్ లిమిటెడ్, హైదరాబాదు |
విడుదల: | 1925 |
పేజీలు: | 85 |
ముద్రణ: | వినాయకసాయి అఫ్‌సెట్ ప్రింటర్స్, హైదరాబాదు |
ప్రతులకు: | ఓరియంట్ లాజ్మన్ లిమిటెడ్, హైదరాబాదు |
కృష్ణ పక్షము దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కవితా సంపుటి. ఇది 1925లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి పద్య కృతుల సంపుటి.[1]
భావ కవితా రీతికి ప్రసిద్ధి కన్నది అతని తొలి పద్య సంపుట త్రయి - కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి. కృష్ణపక్షం సంపుటాన్ని మొదట 1925లో సాహితీ సమితి తరపున ప్రచురించినవారు సభాపతి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి(శివశంకరస్వామి). తరువాత ప్రవాసము - ఊర్వశి అనే సంపుటిని 1929 లో అచ్చువేసినవాడు "జ్యాల" పత్రికాధిపతి ముద్దుకృష్ణ.
ఆ తరువాత కృష్ణపక్షము - ప్రవాసము- ఊర్వశి కలసి ఒకే సంపుటంగా పలు ముద్రణలు పొందాయి. 1975 లో స్వర్ణోత్సవ సందర్భంగా ఈ కావ్యత్రయి తిరిగి ప్రచురితమైంది.
మూలాలు
[మార్చు]- ↑ "నా అసమగ్ర పుస్తకాల జాబితా -4". Archived from the original on 2016-03-19.
బాహ్యలంకెలు
[మార్చు]- "కవిత్వమొక తీరనితృష్ణ". www.teluguvelugu.in. Retrieved 2020-04-13.[permanent dead link]
- "ప్రత్యేకం కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానం (మొదటి భాగం)".
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]