కులశేఖర మహీపాల చరిత్రము
కులశేఖర మహీపాల చరిత్రము | |
కృతికర్త: | శేషము రఘునాథాచార్యుడు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కులశేఖర ఆళ్వార్ |
విభాగం (కళా ప్రక్రియ): | జీవితచరిత్ర |
ప్రచురణ: | Government Oriental Manuscripts Library, మద్రాసు |
విడుదల: | 1955 |
పేజీలు: | 176 |
కులశేఖర మహీపాల చరిత్రము శేషము రఘునాధాచార్య రచించిన పుస్తకము. ఇది 1955 ముద్రించబడినది.
కులశేఖరాళ్వార్
[మార్చు]పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్’ (వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామిని సేవచేస్తుండేవాడు. ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట. నేటికీ తిరుమలలో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు.
కృతికర్త శేషము రఘునాథాచార్యులు
[మార్చు]శేషము రఘునాథాచార్యులు ఈ గ్రంథంలో ఆ కులశేఖర మహాభక్తుని జీవితాన్ని తెలిపారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.
విషయసూచిక
[మార్చు]ప్రథమాశ్వాసము
[మార్చు]కావ్యముఖము, పురవర్ణనము, రాజు వేటకేగుట, హరిణి పూర్వకథ, పరిజనము రాజునరయుట, అనపత్యతకు రాజు విచారించుట, మంత్రులు రాజునోదార్చుట
ద్వితీయాశ్వాసము
[మార్చు]రాజుకడకు భాగవతులు వచ్చుట, భాగవతుల యుపదేశము, వ్రతారంభము, శ్రీమన్నారాయణ సాక్షాత్కారము, వరప్రదానము, కులశేఖరుని జననము, కులశేఖరుడు రాజగుట, వైష్ణవయతి వచ్చుట, రాజు ప్రశ్నములకు యతియుత్తరము, రావణోదంతము, శ్రీమన్నారాయణునితో నింద్రుని తనపాట్లు చెప్పుకొనుట, అభయప్రదానము, శ్రీరాముని అరణ్యగమనము, సీతాపహరణము, సుగ్రీవసమాగమనము, హనుమ సముద్రమునుదాటి సీతను కనుగొనుట, లంకాదహనము, యుద్ధము, రావణ వధ, అయోధ్యా ప్రవేశము, శ్రీరామాభిషేకము
తృతీయాశ్వాసము
[మార్చు]కులశేఖరుని రామాయణ శ్రవణము, కులశేఖరుడు రావణునిపై దండెత్తుట, నీలాదేవి యవతరించుట, వనవిహారము, సూర్యాస్తమయ వర్ణనము, మన్మథాద్యుపాలంబము, శ్రీరంగపతి విరాళి, నీలవేణి నీలావృత్తాంతమును శ్రీరంగపతికి విన్నవించుట
చతుర్థాశ్వాసము
[మార్చు]నీలవేణి నీళాదేవి యొద్దకు వచ్చట, మంత్రుల దుర్మంతము, స్వాములకు దోషములేమికి కులశేఖరుడు పాముముట్టుట, శ్రీమన్నారాయణ సాక్షాత్కారము, నీళా కల్యాణము, నీళను శ్రీదేవి పరిగ్రహించుట.