కురుత్తాళ్వారు అయ్యంగారు
కురుత్తాళ్వారు అయ్యంగారు | |
---|---|
జననం | కురుత్తాళ్వారు అయ్యంగారు 1867 తిరుచనాపల్లి జిల్లా |
మరణం | 1947 |
నివాస ప్రాంతం | అనంతపురం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, రచయిత |
మతం | హిందూ |
కురుత్తాళ్వారు అయ్యంగారు (1867 - 1947)[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[2] ఇతను జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. విద్యార్థులలో దేశభక్తిని, సంఘసేవా శక్తిని పెంపొందించడానికి విశేషంగా కృషి చేశాడు.
జననం
[మార్చు]అయ్యంగారు 1867లో తిరుచనాపల్లి జిల్లా జన్మించాడు. ఇతను హిందూ మతానికి చెందిన అయ్యంగార్ల వంశానికి చెందినవారు. అనంతపురంలో స్థిరపడ్డారు.[2]
ఉద్యోగం
[మార్చు]1909 నుండి 1912 వరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేశాడు. తరువాత 1912 నుండి ధర్మవరంలోని లండన్ మిషన్ హైయర్ ఎలిమెంటరీ స్కూల్‌లో పనిచేసి 1922లో పదవీ విరమణ పొందాడు.[2]
విద్యాబోధన
[మార్చు]విద్యార్థులకు అమరం (సంస్కృత నిఘంటువు), సంస్కృతం నేర్పేవాడు. 1908వ సంవత్సరంలోనే హిందీ దేశ భాషగా ఉండాలని, ప్రతి విద్యార్థి ఈత, గుర్రపు స్వారీ, సాము, గరిడీలు నేర్చుకోవాలనుకునేవారు. ఇతని ఇల్లు పేద విద్యార్థులకు హాస్టల్‌గా ఉండేది.[3]
మరణం
[మార్చు]అయ్యంగారు 1947లో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 2.2 2.3 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).