కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై
స్వరూపం
కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | అలంగుడి, తమిళనాడు | 1898 ఆగస్టు 5
మరణం | 1970 | (వయసు 71–72)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వాయులీన విద్వాంసుడు |
వాయిద్యాలు | వయోలిన్ |
కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై (తమిళం: கும்பகோணம் ராஜமாணிக்கம் பிள்ளை, 1898 - 1970 ) తమిళనాడుకు చెందిన వాయులీన విద్వాంసుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1898, ఆగష్టు 5వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలంగుడి అనే కుగ్రామంలో జన్మించాడు. ఇతడు మొదట నాదస్వర విద్వాంసుడు కందస్వామి పిళ్ళై వద్ద గాత్ర సంగీతం అభ్యసించాడు. తరువాత తిరువిసనల్లూర్ "పల్లవి" నారాయణస్వామి అయ్యర్, పందనల్లూర్ చిన్నస్వామి పిళ్ళైల వద్ద సంగీతాన్ని నేర్చుకున్నాడు. తిరుకోడికవల్ రామస్వామి అయ్యర్ వద్ద నాలుగు సంవత్సరాలు వయోలిన్ నేర్చుకున్నాడు.[1] ఇతడు సోలో ప్రదర్శనలతో పాటు తన సమకాలీన అగ్రశ్రేణి సంగీతవిద్వాంసుల కచేరీలకు వాద్య సహకారం అందించాడు.[2]
బిరుదులు పురస్కారాలు
[మార్చు]- ఇతడు రామనాథపురం, కొచ్చిన్, ఎట్టాయపురం, తిరువాంకూర్, మైసూర్ రాజాస్థానాలలో కచేరీలు చేసి సన్మానాలను అందుకున్నాడు.[2]
- ఇతడు 1940లో తిరువాంకూర్ ఆస్థాన విద్వాంసునిగా, 1942లో ఎట్టాయపురం ఆస్థాన విద్వాంసునిగా నియమితుడైనాడు.[2]
- త్రివేండ్రం మహారాజు చిత్రై తిరునాళ్ ఇతడిని సన్మానించి ఒక ఏనుగును బహుమతిగా ఇచ్చాడు.[3]
- 1948లో మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారాన్ని అందజేసింది.[4]
- 1959లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం వాద్యం (వయోలిన్) విభాగంలో అవార్డును ప్రకటించింది.[5]
- తమిళ్ ఇసై సంఘం వారిచే 1957లో "ఇసై పెరారిజ్ఞర్" బిరుదు.[6]
శిష్యులు
[మార్చు]ఇతని శిష్యులలో ఎం.ఎం.దండపాణి దేశికర్, మాయవరం వి.ఆర్.గోవిందరాజ పిళ్ళై మొదలైన వారు పేరు గడించారు.[2] తమిళ సినిమా నటుడు "త్యాగు" ఇతని మనుమడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Carnatic Instrumentalists". Archived from the original on 2021-10-16. Retrieved 2021-03-28.
- ↑ 2.0 2.1 2.2 2.3 "The journey of music". Archived from the original on 2020-10-30. Retrieved 2021-03-28.
- ↑ Cinema Express article Archived 2014-03-10 at the Wayback Machine (in Tamil)
- ↑ Recipients of Sangita Kalanidhi Archived 2016-03-04 at the Wayback Machine
- ↑ Sageet Natak Akademi awardees Archived 2016-03-31 at the Wayback Machine
- ↑ "Isai Perarignar Award Recipients". Archived from the original on 2012-02-12. Retrieved 2021-03-28.
- ↑ News item Archived 2014-03-10 at the Wayback Machine (in Tamil)