కుంటాల - సోమేశ్వర ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుంటాల సోమేశ్వర ఆలయం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి అనుకొని గుహలో సోమేశ్వర ఆలయం ఉంది[1].ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు[2][3].


కుంటాల సోమేశ్వర ఆలయం
పేరు
ఇతర పేర్లు:సోమన్న జాతర
ప్రధాన పేరు :సోమన్న ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:కుంటాల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు,
ప్రధాన దేవత:గంగాదేవి
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:రాతి గుహ
ఇతిహాసం
సృష్టికర్త:‌సహజ సిద్ధమైన గుహ

స్థల పురాణం

[మార్చు]

పూర్వం కైలాసంలో ఒక రోజు గంగాదేవి, పరమేశ్వరులు ఆడిన చదరంగంలో పరమశివుడు ఓటమి చేందుతాడు. ఓడిపోయిన శివుణ్ణి గంగాదేవి హేళన చేస్తుంది. అప్పుడు కైలాసం వదిలి ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న సహజంగా ఏర్పడిన గుహలో తన ఆత్మలింగాన్ని నిలుపుతాడు.భర్త జాడ వెదుకుతూ గంగాదేవి ,పార్వతీదేవి నారద మహర్షి కి ఈ విషయం తెలుపుతుంది. శివుడిని ఎవరైతే హేళన చేసి బాధ పెట్టారో వారే కైలాసానికి తీసుకొస్తానంటే శివుడి జాడ చెప్తాడు.గంగాదేవి శివుడున్న గుహకు చేరి శివునికి పాలు,పళ్ళు,మారేడు పండ్లు, పత్రి సమర్పించి సేవలు చేస్తుంది.అప్పుడు దేవతలు,నారదుడు వచ్చి గంగాదేవి కి అసలు విషయం చెబుతాడు అప్పుడు గంగాదేవి తన తప్పు మన్నించుమని వేడుకుంటుంది.శివుడు క్షమించి ఆనందింపజేస్తాడు.అప్పుటి నుంచి శివుడు ఆత్మలింగానికి సోమేశ్వర లింగం సోమన్న లింగం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు.

భక్తుల విశ్వాసం

[మార్చు]

కుంటాల జలపాతం లో స్నానం చేసి సోమేశ్వర దేవుని అర్చిస్తే పుణ్యం వస్తుందని భార్యాభర్తల మధ్య ఉన్న కోపతాపాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం.

జాతర

[మార్చు]

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం గుహలో సోమేశ్వర ఆలయంలో[4] మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఘనంగా జాతర జరుగుతుంది.మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు స్థానిక భక్తులు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఆలయానికి అనేక ప్రాంతాల నుండి వేలాది భక్తులు తరలివస్తారు. రాతి గుహలో ఉన్న ఈ సోమేశ్వర ఆలయంలో ఆత్మలింగంతో పాటు గంగాదేవి విగ్రహాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు[5]. ఇక్కడ ప్రత్యేక రుద్రాభిషేకాలు,పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికులు పూర్తి ఏర్పాట్లు చేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Cave temple draws thousands". The Hindu (in Indian English). 2015-02-16. ISSN 0971-751X. Retrieved 2024-07-24.
  2. "మార్మోగుతున్న శివాల‌యాలు". naandi news (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-01. Archived from the original on 2024-07-24. Retrieved 2024-07-24.
  3. Service, Express News (2023-02-19). "Temples across Telangana jampacked for Maha Shivaratri fete". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-24.
  4. Eggoju, Sandeep (2021-03-11). "Adilabad: కుంటాల జలపాతంలో శివయ్య ఆలయం". www.hmtvlive.com. Retrieved 2024-07-24.
  5. NAME, YOUR. "Kuntala Waterfall and Cave temple". Retrieved 2024-07-24.