Jump to content

కిలారి వెంకట రోశయ్య

వికీపీడియా నుండి
కిలారు రోశయ్య
ఎమ్మెల్యే
In office
2019–ప్రస్తుతం
అంతకు ముందు వారుధూళిపాళ్ల నరేంద్ర కుమార్
నియోజకవర్గంపొన్నూరు
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీజనసేన పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నివాసంపొన్నూరు
వెబ్‌సైట్https://www.kilarirosaiah.com/

కిలారి వెంకట రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా, పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కి అల్లుడు.[1][2][3]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

కిలారు రోశయ్య 1968లో జన్మించాడు. ఆయన 1987లో జేకేసీ కాలేజీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి బి.కామ్ పూర్తి చేశాడు. ఆయన జేకేసీ కాలేజీ విద్యార్థి సంఘంలో వైస్-ప్రెసిడెంట్ గా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కిలారు రోశయ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. ఆయన తండ్రి కోటేశ్వర రావు కౌన్సిలర్ గా, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాడు. ఆయన 1985లో గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.

కిలారు రోశయ్య తన తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చాడు.ఆయన 1993లో మిర్చి అసోసియేషన్ కు ఉపాధ్యక్షుడిగా, 1994లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. కిలారు రోశయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు నగర అధ్యక్షుడిగా పని చేశాడు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

కిలారు రోశయ్య 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా, పొన్నూర్ స్థానం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై 1200 ఓట్ల తేడాతో గెలిచాడు.[4]

కిలారు రోశయ్య 2024 సెప్టెంబర్ 26న మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Dailyhunt (18 February 2020). "పెద్దాయనకు పెద్ద పదవే - Telugu Post Telugu". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  3. News18 Telugu (1 March 2019). "'టీడీపీని ఢీ కొట్టాలంటే వాళ్లే కరెక్ట్'.. ఓ సామాజికవర్గంపై జగన్ ప్రత్యేక ఫోకస్". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (2019). "Ponnur Constituency Winner List in AP Elections 2019 | Ponnur Constituency MLA Election Results 2019". Archived from the original on 29 జూలై 2021. Retrieved 29 July 2021.
  5. EENADU (26 September 2024). "పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి". Archived from the original on 26 September 2024. Retrieved 26 September 2024.