కియా ఇండియా
రకం | అనుబంధ సంస్థ |
---|---|
పరిశ్రమ | మోటారు వాహనాలు |
స్థాపన | 19 మే 2017 |
ప్రధాన కార్యాలయం | అనంతపురం, ఆంధ్రప్రదేశ్ |
కీలక వ్యక్తులు | Tae Jin Park (CEO) |
ఉత్పత్తులు | మోటారు వాహనాలు |
Production output | 177,982 (2020)[1] |
మాతృ సంస్థ | కియా |
వెబ్‌సైట్ | http://www.kia.com/in/ |
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో కియా ఉపవిభాగం. దీనిని 2017 మే 19 న ప్రారంభించారు.[2] ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీని విస్తీర్ణం సుమారు 536 ఎకరాలు. 2019 జనవరిలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ 2019 జూలై 31 నాటికి మొదటగా కియా సెల్టోస్ మోడల్ ను ఆవిష్కరించింది. సుమారు 2 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ ప్లాంటు ఏడాదికి సుమారు 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేయగలదు.[3]
చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు హయాంలో ఈ సంస్థకు ప్రాథమిక సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఇచ్చాడు. ఈ సంస్థ తర్వాత వాహన విడిభాగాల సంస్థలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రణాళిక. 2019 లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సిపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు 75% ఉద్యోగాలు ప్రాంతీయులకు కేటాయించాలని పాలసీ తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో కియా కొంత ఇబ్బంది పడింది. తమ పరిశ్రమకు కావలసిన నిపుణులను అంత పెద్ద స్థాయిలో నియమించుకోవడం కష్టమని భావించింది. ఒక దశలో ఈ కార్మాగారం తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు వచ్చాయి.[4] కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ వార్తలు నిజం కాదని చెప్పాడు. తమ ప్రభుత్వం కియా సంస్థతో కలిసి పనిచేస్తుందని ప్రకటించాడు.[5]
ఉత్పత్తులు
[మార్చు]భారతదేశంలో మార్కెట్ కోసమే వివిధ రకాల మోడళ్ళను కియా ప్రవేశ పెట్టింది. కియా మోటార్స్ ప్రారంభించిన రెండు సంవత్సరాలలో లాభాలతో నడుస్తున్నది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 1111 కోట్ల పన్నులతదుపరి లాభంతో కంపెనీ ప్రపంచ మొత్తం ఆదాయంలో 5% భారత విభాగం ద్వారా పొందుతుంది. 2022 లో 300000 వాహానాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం, మొత్తం కంపెనీ ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి చేరువవుతుంది.[6]
ప్రస్తుత మోడళ్ళు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "Sales Results". pr.kia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-02.[permanent dead link]
- ↑ "KIA India Pvt Ltd (bloomberg profile)". www.bloomberg.com. Retrieved 2020-10-02.
- ↑ "Kia Motors | India Plant". www.kia.com (in Indian English). Retrieved 2020-10-02.
- ↑ Sheth, Hemai. "Kia Motors ponders shifting $1.1-billion plant from Andhra Pradesh to Tamil Nadu, reports say". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-18.
- ↑ P, Ashish. "Why Kia is important for Andhra Pradesh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-03-18.
- ↑ "Kia Motors' Indian Plant To Manufacture 10 Per Cent Of Its Total Global Production In 2022". Swarajya. 2022-02-22. Retrieved 2022-03-17.